E-Paper
Advertisement

కందుగుల ఆరోగ్య ఉపకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు.. ANMలకు షోకాజ్ నోటీసులు జారీ!

కందుగుల ఆరోగ్య ఉపకేంద్రంలో ఆకస్మిక తనిఖీలు.. ANMలకు షోకాజ్ నోటీసులు జారీ!
Advertisement

Health Negligence: స్వేచ్ఛ బ్యూరో: హుజూరాబాద్ మండల పరిధిలోని వైద్య సేవలను మెరుగుపరచడంలో భాగంగా, చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని కందుగుల ఆరోగ్య ఉప కేంద్రాన్ని హుజూరాబాద్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌వో (Dy.DM&HO) డాక్టర్ శ్రవణ్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో ఆయనతో పాటు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ (CHO) సదానందం కూడా పాల్గొన్నారు.

విధుల్లో నిర్లక్ష్యంపై ఆగ్రహం..

తనిఖీ సమయంలో ఉపకేంద్రంలోని రికార్డులను, అందుతున్న వైద్య సేవలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే, విధి నిర్వహణలో ఉండాల్సిన ఏఎన్ఎంలు (ANMs) సైదా , సుమలత ,లు, ఇద్దరూ కూడా విధులకు గైర్హాజరైనట్లు గుర్తించారు. ముందస్తు సమాచారం లేకుండా, విధులకు గైర్హాజరు కావడం పట్ల డాక్టర్ శ్రవణ్ కుమార్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్షేత్రస్థాయిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాల్సిన సిబ్బంది లేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు.

Advertisement

Also Read: విడాకుల విషయంలో పశ్చాత్తాపం లేదు.. సంతోషంగా ఉన్నా.. ఫస్ట్ టైం స్పందించిన హన్సిక!

వివరణ కోరుతూ ఆదేశాలు..

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సదరు ఏఎన్ఎంలపై తక్షణ చర్యలకు అధికారులు ఆదేశించారు. విధులకు ఎందుకు గైర్హాజరయ్యారో తగిన కారణాలతో వివరణ ఇవ్వాలని కోరుతూ సైదా మరియు సుమలతలకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో తెలిపారు. వివరణ సంతృప్తికరంగా లేని పక్షంలో ఉన్నతాధికారులకు నివేదించి తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు..

Advertisement

ఈ సందర్భంగా డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజారోగ్య విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సిబ్బంది పూర్తిస్థాయిలో సహకరించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు వైద్యం అందించే ఉపకేంద్రాల్లో సిబ్బంది సమయపాలన పాటించాలని, లేనిపక్షంలో శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ తనిఖీలో స్థానిక ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Also Read: వర్షాకాలం ముందే టెస్టులు పూర్తి.. ఆ తర్వాతే శాశ్వత మరమ్మతులు.. ఎన్ డీఎస్ ఏ ఛైర్మన్‌తో మంత్రి ఉత్తమ్ భేటీ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×