E-Paper
Advertisement

కాంగ్రెస్ రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ-హరీష్‌రావు ఎద్దేవా

కాంగ్రెస్ రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ-హరీష్‌రావు ఎద్దేవా
Advertisement

Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టాల్సింది రైతు ఆశీర్వాద సభ కాదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు.  రైతు వంచన సభ పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ముమ్మాటికీ రైతులను మోసం చేసిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలేదని దుయ్యబట్టారు. రుణ మాఫీ చేస్తామని అన్నారని, ఎక్కడ జరిగిందంటూ ప్రశ్నించారు.

రైతు ఆశీర్వాద సభ కాదు.. రైతు వంచన సభ-హరీష్‌రావు

Advertisement

మంగళవారం జడ్చర్లలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో హరీష్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో జూన్ 30 రోజుని చీకటి రోజుగా వర్ణించారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో వలస వచ్చిన 54 మంది కార్మికులు సజీవ దహనమైన ఘటనకు ఏడాది పూర్తి అయ్యింది.

సిగాచి యాజమాన్య నిర్లక్ష్యం, ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, పర్యవేక్షణ వైఫల్యం వంటి కారణాలతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఘటన జరిగిన రోజు సీఎం రేవంత్ రెడ్డి నగరంలో ఉంటూ అక్కడికి   రాలేదంటూ గుర్తు చేశారు. బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడవక పోవడం హృదయ విదారకమన్నారు.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే

విమర్శలు తీవ్రంకావడంతో ఘటన జరిగిన మరుసటి రోజు ఆ ప్రాంతానికి వచ్చారన్నారు. ప్రతి కుటుంబానికి కోటి ఇస్తానని ప్రకటించినా, ప్రభుత్వం తరపున కేవలం లక్ష మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. కార్మికుల పీఎఫ్, ఈఎస్ఐ, లైఫ్ ఇన్స్యూరెన్స్, వైద్య ఖర్చులను పరిహారంలో చేర్చారని ఆరోపించారు.

అంతేకాదు మృతుల డెత్ సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పడం మరీ దారుణమన్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా, చివరకు క్షతగాత్రులకు సహాయం చేయలేదన్నారు. ఈ ఘటన ముమ్మాటికీ సామూహిక హత్యగా పేర్కొన్నారు. 818 HP కి అనుమతి తీసుకున్న కంపెనీ, చివరకు 1777 HP నడపడం, ఆపై సేఫ్టీ గార్డ్స్, ఫైర్ NOC, డస్ట్ కంట్రోల్ వ్యవస్థ లేకపోవడం వంటివి విచారణలో తేలిందన్నారు.

ALSO READ: భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులేనా.. అయితే మీకు ఈ రూల్ వర్తించదు..?

యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోవడం, ఎండీని అరెస్టు చేసి వెంటనే బెయిల్‌పై విడుదల చేయడం లోపాయికారీ ఒప్పందాన్ని సూచిస్తుందన్నారు. సిగాచి ఆస్తులను అటాచ్ చేసి బాధితులకు కోటి రూపాయల పరిహారం తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.

మాట తప్పడం మీకు అలవాటేనని, ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలను మోసం చేయవద్దన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ ఉంటేనే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యకర్తలు జోష్ చూస్తుంటే బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×