E-Paper
Advertisement

Harish rao: నిర్మలకు హరీశ్ లేఖ.. సీఎస్ఎస్ నిధుల కోసం రిక్వెస్ట్

Harish rao: నిర్మలకు హరీశ్ లేఖ.. సీఎస్ఎస్ నిధుల కోసం రిక్వెస్ట్
Advertisement

Harish rao: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి హరీశ్ రావు లేఖ రాశారు. ఏపీకి బదలాయించిన సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులు రూ.495 కోట్లను తిరిగి తెలంగాణకు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. 2014-15లో సీఎస్‌ఎస్‌ కింద తెలంగాణకు రావాల్సిన నిధులను పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాలో జమచేశారని, వాటిని తిరిగి తెలంగాణకు ఇప్పించాలని విన్నవించారు. గతంలో ఇదే అంశంపై పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా ఫలితం లేకుండా పోయిందనని హరీశ్ రావు అన్నారు. ఇప్పటికైనా స్పందించి నిధులను ఇప్పించాలని నిర్మల సీతారామన్ ను కోరారు.

రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాది 2014-15లో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను ఏపీ, తెలంగాణ మధ్య జనాభా ప్రాతిపదికన విభజించారు. అయితే పొరపాటున మొత్తంం సీఎస్ఎస్ నిధులను ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పిదం తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులు..రాకుండా పోయాయని అన్నారు. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర, ఏపీ ప్రభుత్వాలతో పాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లామని.. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు.

Advertisement

8 సంవత్సరాలు గడుస్తున్నా.. రూ.495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని హరీశ్ రావు అన్నారు. ఇప్పటికైనా ఆ మొత్తాన్ని తిరిగి తెలంగాణకు విడుదల చేసేలా కృషి చేయాలని నిర్మలా సీతారామన్‌ను కోరారు. వ్యక్తిగతంగా శ్రద్ధ తీసుకొని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని లేఖలో పేర్కొన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×