E-Paper
Advertisement

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే.. మీరేం ప్రశ్నించరా? బీజేపీ ఎంపీలపై హరీశ్ రావు ఫైర్

తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే.. మీరేం ప్రశ్నించరా? బీజేపీ ఎంపీలపై హరీశ్ రావు ఫైర్
Advertisement

Harish Rao: బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడిన మాటలు చూసి తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు అన్నారు. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతిస్తుంటే.. ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా అంటూ రాష్ట్ర బీజేపీ ఎంపీలను హరీశ్ రావు ప్రశ్నించారు.

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి.. ఈ నెల 20న బీఆర్ఎస్ లో చేరనున్న నేపథ్యంలో కేటీఆర్, హరీశ్ రావు జగిత్యాలలో పర్యటించారు. ఇందుకు సంబంధించి బహిరంగ సభ ఏర్పాట్లను వారు పరిశీలించారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డి చేరిక కరీంనగర్ జిల్లాకే కాకుండా యావత్ ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ కు బలాన్ని పెంచుతుందని అన్నారు. ‘రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి’ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని.. ఇందుకు జీవన్ రెడ్డి చేరికే సజీవ సాక్ష్యమన్నారు.

Advertisement

మరోవైపు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమేని హరీశ్ రావు అన్నారు. ఇందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారన్ని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా? ప్రశ్నించారు. కనీస అవగాహన లేకుండా తెలంగాణపై, ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారని విమర్శించారు.

Also Read: రాహుల్ గాంధీ చెప్పిందే జరిగింది.. మహిళా బిల్లుపై కేంద్రం తప్పటడుగు ఎక్కడ వేసింది?

Advertisement

ఒక ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించడం దారుణమని హరీశ్ రావు అన్నారు. బీజేపీ తక్షణమే తేజస్వి వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుందని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వికి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన, మూతి పగిలే సమాధానం చెప్పేవాళ్లని హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా మౌనంగా కూర్చున్నారని విమర్శించారు.

Also Read: రేవంత్‌.. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌! మోడీఎత్తుకు రాహుల్ పైఎత్తు! ఎన్డీయే వ్యూహానికి… ఇండి ప్ర‌తివ్యూహం..

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×