E-Paper
Advertisement

‘మెునగాడు కాదు.. మోసగాడు’.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హరీశ్ రావు!

‘మెునగాడు కాదు.. మోసగాడు’.. సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డ హరీశ్ రావు!
Advertisement

Harish Rao: రైతులకు రూ.29,350 కోట్ల భరోసా ఎగ్గొట్టి.. కేంద్రం చెబితేనే పంటలు కొంటామంటున్న సీఎం రేవంత్.. మెునగాడు కాదు మోసగాడంటూ హరీశ్ రావు ధ్వజమెత్తారు. ఓ పక్క నిధులు లేవంటూనే తన గెస్ట్ హౌస్ కు రూ.100 కోట్లు, కంచెకు రూ.17 కోట్లు, పక్క రాష్ట్రాల్లో పేపర్ ప్రకటనలకు రూ.వందల కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వస్తోందని ప్రశ్నించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నేతల భేటిలో పాల్గొని హరీశ్ రావు మాట్లాడారు. నాడు ఔరంగజేబు జుట్టుపై పన్నులు వేస్తే.. నేటి రేవంత్ రెడ్డి పెట్రోల్, డీజిల్, ఎరువుల ఛార్జీలతో ప్రజల రక్తం తాగుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాబోయే ఎన్నికల్లో పాలమూరులో 14కు 14 సీట్లు గెలిచి కొడంగల్‌లోనే రేవంత్‌ను చిత్తుగా ఓడిస్తామని హరీశ్ రావు సవాలు విసిరారు. మరోవైపు నల్లమల బిడ్డనంటూ పదే పదే చెబుతూ.. నల్లమల గౌరవం రేవంత్ రెడ్డి తగ్గిస్తున్నారని హరీశ్ రావు అన్నారు. ఇప్పటివరకు రూ. 29,350 కోట్ల రైతు భరోసా డబ్బులు బాకీపడ్డారని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో బోనస్ కాస్తా బోగస్ అయిందన్నారు. మొలకెత్తిన గింజలు కొనలేని రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌ను మొలకెత్తనియ్య అని అంటున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

జొన్నలు, మక్కలు, సోయాబీన్, పల్లి, సన్‌ప్లవర్ ను కేంద్రం ఎంత కొనమంటే అంతే కొంటామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటోందని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారుల, మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మగా మారిపోయారని విమర్శించారు. తెలంగాణను సాధించుకున్న పార్టీగా బీఆర్ఎస్ నిత్యం ప్రజల పక్షానే పోరాడుతూ ఉంటుందని హరీశ్ రావు స్పష్టం చేశారు. 100 స్థానాల్లో బీఆర్ఎస్ ను గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కాబట్టి రేవంత్ సర్కార్ ను నిరంతరం ఎండగడుతూనే ఉండాలని శ్రేణులకు హరీశ్ రావు పిలుపునిచ్చారు.

Also Read: భారతీయ విద్యార్థులకు బిగ్ షాక్.. ఇక అమెరికాలో చదువు అంత ఈజీ కాదు..!

Advertisement

బీఆర్ఎస్ క్యాడర్ పై కేసులు పెట్టిన ఎవరినీ.. తమ ప్రభుత్వం వచ్చాక వదిలిపెట్టమని హరీశ్ రావు అన్నారు. రిటైర్డ్ అయినా, ఎక్కడున్నా పట్టుకొని వచ్చి బొక్కలో వేస్తామని హెచ్చరించారు. మరోవైపు ఈ ప్రభుత్వంలో ప్రాజెక్ట్ లు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని హరీశ్ రావు మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో కృష్ణా నీళ్లు ఆంధ్రాకు పోతున్నాయన్నారు. కార్యకర్తలు గట్టిగా పనిచేసి అచ్చంపేటతో పాటు తెలంగాణ గడ్డపై గులాబీ జెండా ఎగురవేయాలని సూచించారు.

Also Read: ఫోన్‌లో ‘True 5G’ సిగ్నల్ ఉన్నా.. ఇంటర్నెట్ రావడం లేదా? అసలు కారణాలు ఇవే!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×