E-Paper
Advertisement

రైతుల అరిగోస పడుతున్నారు.. అసలు సర్కార్ ఏం చేస్తోంది..? హరీష్ రావు ఫైర్

రైతుల అరిగోస పడుతున్నారు.. అసలు సర్కార్ ఏం చేస్తోంది..? హరీష్ రావు ఫైర్
Advertisement

రాష్ట్రవ్యాప్తంగా యూరియా అమ్మకాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధం విధించడాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో రేవంత్ రెడ్డి సర్కార్ తీరుపై ఆయన నిప్పులు చెరిగారు. యూరియా స్టాక్ అందుబాటులో ఉన్నప్పటికీ అమ్మకాలు నిలిపివేయడం దుర్మార్గమని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతులకు కష్టాలు మొదలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎరువుల విక్రయాలపై ఆంక్షలు విధించడం రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిదర్శనమని విమర్శించారు.

యూరియా అమ్మకాలు ఆపాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో ప్రభుత్వం స్పష్టం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. డీలర్లు, అగ్రో సెంటర్లు, సొసైటీల్లో నిల్వలు ఉన్నా రైతులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎరువుల కోసం అన్నదాతలు రోడ్ల మీద తిరుగుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని నిలదీశారు. ముఖ్యంగా చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు ఈ నిర్ణయం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ఎరువులు సులభంగా అందించాల్సింది పోయి కొత్తగా తెచ్చిన యాప్‌లు రైతుల పాలిట శాపంగా మారాయని పేర్కొన్నారు.

Advertisement

పెరిగిన ఎరువుల ధరలతో ఒకవైపు రైతులు సతమతమవుతుంటే ఇప్పుడు అమ్మకాలపై అనధికారిక బ్యాన్ విధించి వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని హరీశ్ రావు విమర్శించారు. యూరియా వినియోగం తగ్గించాలంటూ ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో దారుణంగా విఫలమైన ప్రభుత్వం రైతు సంక్షేమ వారోత్సవాలు జరపడం అన్నదాతలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో రైతులు నిలదీస్తుంటే అధికారులు రైతు వేదికల నుంచి పారిపోయే పరిస్థితి నెలకొందని ఇది పాలనా వైఫల్యానికి పరాకాష్ట అని ఎద్దేవా చేశారు.

రైతు డిక్లరేషన్ పేరిట హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చలేదని హరీశ్ రావు విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, బోనస్, పంట బీమా ఇలా ప్రతి విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం అట్టర్ ప్లాప్ అయ్యిందని దుయ్యబట్టారు. కొనుగోలు చేసిన పంటకు పైసలు ఇవ్వకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఈ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వారోత్సవాల డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎరువుల కొరత లేకుండా చూశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరి వీడి యూరియాపై ఉన్న అనధికారిక బ్యాన్‌ను వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

ALSO READ: కొత్వాల్‌గూడలో అక్రమ యూనిట్ల ధ్వంసం.. హైడ్రా దూకుడుకు అక్రమార్కుల వణుకు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×