E-Paper
Advertisement

Harish Rao: కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావా? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్

Harish Rao: కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి ప్రభుత్వానికి చేతులు రావా? మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్
Advertisement

Harish Rao:  తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. బుధవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని, పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి.. అన్నంపెట్టే రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమకు తాజా పరిణామాలే సాక్ష్యం అన్నారు. ఈ నెల 4న మిర్యాలగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేస్తాం.. ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నాం అని ప్రకటించారన్నారు. తీరా ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు దాటుతున్నా రైతుబంధు ఊసే లేదన్నారు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లోనూ దీనిపై ఉలుకు లేదు, పలుకు లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఎకరానికి 15 వేలు ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం ఓట్ల కోసమే రైతుబంధు పేరుతో నాటకాలు ఆడిందని ఇప్పుడు బట్టబయలైందన్నారు.

ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు వేలకోట్లు

రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వానికి.. మూసీ సుందరీకరణకు వేల కోట్లు, సుందరీకరణలో భాగంగా కూల్చే ఇండ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి వేలకోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని నిలదీశారు. ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు వేలకోట్లు, రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారన్నారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం 25 వేల కోట్ల బిల్లులు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి వేల కోట్లు ఉంటాయి కానీ, కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం చేతులు రావా? అని నిలదీశారు. ఒకవైపు ఇనుప కంచెలు లేని ప్రజా పాలన అని గొప్పలు చెప్తూనే.. ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ లో వందల కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయం కట్టుకుంటున్నారన్నారు.  ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ బలమైన ఇనుప కంచెల కోసమే 9 కోట్లు ఖర్చు చేస్తుండటం చూస్తుంటే.. మీ ఏడో గ్యారెంటీ ‘ప్రజాస్వామిక పాలన’ ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అర్థమవుతోందన్నారు. ఆ ప్యాలెస్ పక్కనే 5 కోట్లతో ఫుట్ బాల్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా కోర్టు కట్టుకుంటున్నారన్నారు. అందాల పోటీలకు, ఫుట్ బాల్ మ్యాచ్ లకు వందల కోట్లు ఖర్చు పెడుతూ.. అన్నంపెట్టే రైతన్న నోట్లో మాత్రం మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ మోసపూరిత వైఖరిని, అన్నదాతలను పెడుతున్న తిప్పలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పగటివేషాలు, ఓట్ల కోసం నాటకాలు కట్టిపెట్టి, వెంటనే రైతులందరికీ రైతుబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: Samsung Price Hike: శాంసంగ్ ఫ్యాన్స్‌కు షాక్.. గెలాక్సీ A, F సిరీస్ ఫోన్ల ధరలు పెంచేసిన కంపెనీ.. కొత్త ధరలు ఇవే

రైతులను నిలువునా మోసం

రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆరోపించారు. బుధవారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయని, పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్న ఈ ప్రభుత్వానికి.. అన్నంపెట్టే రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం నిధులు కరువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమకు తాజా పరిణామాలే సాక్ష్యం అన్నారు. ఈ నెల 4న మిర్యాలగూడ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేస్తాం.. ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నాం అని ప్రకటించారన్నారు. తీరా ఎన్నికల కోడ్ ముగిసి పది రోజులు దాటుతున్నా రైతుబంధు ఊసే లేదన్నారు. మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ లోనూ దీనిపై ఉలుకు లేదు, పలుకు లేదని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఎకరానికి 15 వేలు ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేవలం ఓట్ల కోసమే రైతుబంధు పేరుతో నాటకాలు ఆడిందని ఇప్పుడు బట్టబయలైందన్నారు.

మూసీ సుందరీకరణకు వేల కోట్లు

Advertisement

రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వానికి.. మూసీ సుందరీకరణకు వేల కోట్లు, సుందరీకరణలో భాగంగా కూల్చే ఇండ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి వేలకోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని నిలదీశారు. ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు వేలకోట్లు, రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారన్నారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్లకు కమిషన్ల కోసం 25 వేల కోట్ల బిల్లులు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. ఢిల్లీ పెద్దలకు మూటలు పంపడానికి వేల కోట్లు ఉంటాయి కానీ, కష్టాల్లో ఉన్న రైతన్నకు రైతుబంధు ఇవ్వడానికి మాత్రం చేతులు రావా? అని నిలదీశారు. ఒకవైపు ఇనుప కంచెలు లేని ప్రజా పాలన అని గొప్పలు చెప్తూనే.. ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ లో వందల కోట్లతో ప్యాలెస్ లాంటి క్యాంప్ కార్యాలయం కట్టుకుంటున్నారన్నారు. ఆ క్యాంప్ ఆఫీస్ చుట్టూ బలమైన ఇనుప కంచెల కోసమే 9 కోట్లు ఖర్చు చేస్తుండటం చూస్తుంటే.. మీ ఏడో గ్యారెంటీ ‘ప్రజాస్వామిక పాలన’ ఎంత గొప్పగా వర్ధిల్లుతుందో అర్థమవుతోందన్నారు. ఆ ప్యాలెస్ పక్కనే 5 కోట్లతో ఫుట్ బాల్ ఆడుకోవడానికి ప్రత్యేకంగా కోర్టు కట్టుకుంటున్నారన్నారు. అందాల పోటీలకు, ఫుట్ బాల్ మ్యాచ్ లకు వందల కోట్లు ఖర్చు పెడుతూ.. అన్నంపెట్టే రైతన్న నోట్లో మాత్రం మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ మోసపూరిత వైఖరిని, అన్నదాతలను పెడుతున్న తిప్పలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పగటివేషాలు, ఓట్ల కోసం నాటకాలు కట్టిపెట్టి, వెంటనే రైతులందరికీ రైతుబంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: Upcoming Car March 2026: నిస్సాన్ టెక్టన్ To స్కోడా కుషాక్ ఫేస్‌ లిఫ్ట్, మార్చిలో లాంచ్ కాబోయే క్రేజీ కార్లు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×