E-Paper
Advertisement

బీఆర్ఎస్ పేరు తుడిపే కుట్ర.. ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్..!

బీఆర్ఎస్ పేరు తుడిపే కుట్ర.. ప్రభుత్వం పై హరీష్ రావు ఫైర్..!
Advertisement

koheda Market Yard: స్వేచ్ఛ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం కోహెడలో స్థలం సేకరించి మార్కెట్కు కేటాయించామని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఇప్పుడు ఈ స్థలాన్ని టీజీఐఐసీకి అప్పగించి, మార్కెట్ను దిల్ భూముల్లోకి తరలించే కుట్ర జరుగుతుందని అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కోహెడ పండ్ల మార్కెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం అర్ధాంతరంగా తరలించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రైతుల ఆందోళనలు, స్థానిక పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు స్థలాన్ని సందర్శించి సమగ్రంగా పరిశీలించారు.

దురుద్దేశంతో వివాదాలు

అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడాతూ.. రైతుల తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తూ, అన్ని వసతులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ మార్కెట్‌ను నిర్మించడానికి గత బీఆర్ఎస్ 200 ఎకరాల ప్రభుత్వం భూమి కేటాయించిందని తెలిపారు. మార్కెట్ నిర్మాణానికి రూ.350 కోట్ల నిధులు సమకూర్చిందని అన్నారు. కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వ పేరు వినిపించకుండా చేయాలనే దురుద్దేశంతో వివాదాలున్న భూమిలోకి తరలించడం అన్యాయమని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిందన్నారు. ధరణి పేరుతో భూములన్నీ బీఆర్ఎస్ కొల్లగొడుతుందని గగ్గోలు పెట్టిన కాంగ్రెస్… విలువైన ప్రభుత్వ భూములను దాళరులకు అప్పగించి కమిషన్ తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందన్నారు.

Advertisement

Also Read: రేపు కర్రెగుట్టలకు డీజీపీ శివధర్ రెడ్డి.. గుత్తికొయ్యలతో ముఖాముఖి, కారణం అదేనా?

మా పోరాటం..

వ్యక్తిగత పంచాయతీల కోసం కాకుండా రైతు ప్రయోజనాలకు మా పోరాటం ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో కోట్ల ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి రైతులను భూ భారతి పేరు ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల రైతు పక్షపాతి కనుక సీఎం పై పోరాడి భూ తరలింపును నిలిపేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కాలేరు వెంకటేష్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు క్యామ మల్లేష్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి(బంటి) తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ నూతన చైర్మెన్, కౌన్సిలర్‌లను సన్మానించి మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డిని హరీష్ రావు అభినందించారు.

Advertisement

Also Read: నూతన రైతు డిస్కంలో ప్రాంతీయ చిచ్చు.. సీఎండీ ఆఫీసులో అవమానకర సీన్లు..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×