E-Paper
Advertisement

Hyderabad News: సిట్ విచారణకు హరీష్‌రావు.. పార్టీ ఆఫీసు నుంచి కారులో, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం

Hyderabad News: సిట్ విచారణకు హరీష్‌రావు.. పార్టీ ఆఫీసు నుంచి కారులో, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం
Advertisement

Hyderabad News: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు ఇవ్వడంపై  మంగళవారం ఉదయం మీడియా ముందుకొచ్చారు మాజీ మంత్రి హరీష్‌రావు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ విచారణకు తాను హాజరువుతున్నానని, తాము భయపడేది లేదన్నారు. ఫోన్ టాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పు చెయ్యలేదని కుండబద్దలు కొట్టేశారు. మీడియా సమవేశం తర్వాత తెలంగాణ భవన్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వరకు కారులో వెళ్లారు. ఆ తర్వాత విచారణకు హాజరయ్యారు.

సిట్ విచారణకు హాజరవుతున్నా-హరీష్‌రావు

Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల నేపథ్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు పార్టీ ఆఫీసులో కీలక నేతలతో హరీష్‌రావు-కేటీఆర్‌లు సమావేశమయ్యారు. దీనికి న్యాయ నిపుణలు హాజరయ్యారు. విచారణ నేపథ్యంలో ఎలా వ్యవహారించాలి? ఏయే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి? అనేదానిపై వారి నుంచి సలహాలు తీసుకున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చారు మాజీ మంత్రి హరీష్‌రావు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ టాపింగ్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని కుండబద్దలు కొట్టేశారు. ఈ విషయంలో తాము ఎలాంటి తప్పు చెయ్యలేదన్నారు.  ఫోన్ టాపింగ్ కేసుపై గతంలో హైకోర్టులో గెలిచామని,  రెండేళ్లుగా ఈ కేసు నడుస్తోందన్నారు.

Advertisement

కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌‌రావు ఆగ్రహం

గత రాత్రి నోటీసులు అందాయని, సిట్ విచారణకు హాజరవుతున్నానని వెల్లడించారు హరీష్‌రావు. 9 గంటలకు నోటీసులు ఇచ్చారని, ఆ సమయంలో తాను సిద్ధిపేట్‌లో ఉన్నట్లు తెలిపారు. సోమవారం నోటీసు ఇచ్చి, మంగళవారం విచారణకు రావాలని చెప్పడం ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో తాము ఎక్కడా తలొగ్గలేదన్నారు. ఈ విషయంలో భయపడేది లేదని, అక్రమాలకు, అవినీతి పాల్పడే వ్యక్తులం కాదని చెప్పారు. గతంలో కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టింది ప్రజలు గమనిస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు.

ALSO READ: జ్యూరిచ్‌కు చేరుకున్న సీఎం రేవంత్ టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం

ఇదంతా డైవర్షన్ కోసం ఆడుతున్న ఆటగా వర్ణించారు. ఎన్నిసార్లు పిలిచినా ఎక్కడికైనా విచారణకు వస్తానని అన్నారు హరీష్‌రావు. రాజకీయల కోసం సీఎం రేవంత్ చేస్తున్న డ్రామాగా వర్ణించిన ఆయన, ఇందులో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ కేసును న్యాయస్థానాలు కొట్టి వేశాయని, మళ్లీ కొత్తది క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.

బొగ్గు కుంభకోణంపై ఏ మంత్రి స్పందించలేదన్న ఆయన, సోమవారం ఉదయం దీని గురించి బయట పెడితే సాయంత్రానికి నోటీసు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు మహాలక్ష్మి స్కీమ్, వృద్ధాప్య పెన్షన్ గురించి ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చారని చెప్పుకొచ్చారు.

రాష్ట్రానికి కృష్ణ నది నీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్‌కు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తనకు నోటీసులు ఇచ్చారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలు తలకిందలు అయ్యాయని, అందులో తాము ఘన విజయం సాధించామన్నారు హరీష్‌రావు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×