E-Paper
Advertisement

Harish Anna Job App: సిద్దిపేట యువతకు గేమ్ చేంజర్.. హరీష్ అన్న ఉద్యోగ యాప్ ను ప్రారంభించిన హరీష్ రావు!

Harish Anna Job App: సిద్దిపేట యువతకు గేమ్ చేంజర్.. హరీష్ అన్న ఉద్యోగ యాప్ ను ప్రారంభించిన హరీష్ రావు!
Advertisement

Harish Anna Job App: సిద్దిపేట యువత బంగారు భవిష్యత్తు కోసం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు కీలక అడుగు వేశారు. నిరుద్యోగులకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించే లక్ష్యంతో ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ను ఆయన ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. మార్కెట్‌లో అనేక యాప్‌లు ముందు ఉచితమని చెప్పి తర్వాత డబ్బులు వసూలు చేస్తాయని, కానీ ఈ యాప్ పూర్తిగా ఉచితమని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పోటీ ప్రపంచంలో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.

సిద్దిపేటను అతిపెద్ద ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దిన వైనాన్ని హరీష్ రావు గారు ఈ సందర్భంగా గుర్తుచేశారు. మెడికల్, నర్సింగ్, పారామెడికల్ కాలేజీలతో పాటు ఐటీ టవర్, అగ్రికల్చర్ కాలేజీలు ఇలా అన్ని రకాల విద్యాసంస్థలను ఇక్కడికి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఐటీ టవర్ ద్వారా స్థానిక యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు రానున్నాయని వెల్లడించారు. సిద్దిపేట కేవలం విద్యకే కాకుండా రిజర్వాయర్లు, ఆలయాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి మౌలిక వసతులకు కూడా ఒక మోడల్ టౌన్‌గా మారిందని గర్వంగా చెప్పారు.

Advertisement

నేటి యువత సెల్ ఫోన్లు, సోషల్ మీడియా, గంజాయి వంటి వ్యసనాలకు బానిస అవుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మొబైల్‌ను సక్రమంగా వినియోగించుకుని జీవితంలో పైకి రావాలని హితవు పలికారు. “ఒక్క సంవత్సరం కష్టపడితే జీవితాంతం సుఖపడతారు.. ఈ సంవత్సరం ఎంజాయ్ చేస్తే జీవితాంతం కష్టపడాల్సి వస్తుంది” అంటూ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పేదరికం పట్టుదలకు అడ్డుకాదని, టైలర్, ఆటో డ్రైవర్ల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చదివి డాక్టర్లైన ఉదాహరణలను ఆయన వివరించారు.

యువత కేవలం ఉద్యోగాలు చేసేవారిగానే కాకుండా, నలుగురికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని హరీష్ రావు గారు ఆకాంక్షించారు. హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేయలేని పేద విద్యార్థులకు ఈ ‘హరీష్ అన్న ఉద్యోగ యాప్’ ఒక గేమ్ చేంజర్‌గా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా చదివితే ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం కష్టం కాదని భరోసా ఇచ్చారు. ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకుని ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన మనసారా కోరుకున్నారు.

Advertisement

Read Also: India AI Impact Summit: ఏఐ శకం మొదలు.. హైదరాబాద్ అనువైన ప్రదేశం, ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో సీఎం రేవంత్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×