// // Harish Rao on Vijay TVK win: టీవీకే విజయకేతనం.. విజయ్‌కు హరీష్ రావు అభినందనలు.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు -->
E-Paper
Advertisement

టీవీకే విజయకేతనం.. విజయ్‌కు హరీష్ రావు అభినందనలు.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

టీవీకే విజయకేతనం.. విజయ్‌కు హరీష్ రావు అభినందనలు.. కవిత ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(TVK) పార్టీ సంచ‌ల‌న విజ‌య సాధించిన నేప‌థ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. టీవీకే సాధించిన అద్భుతమైన విజయం దక్షిణాది రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపిందని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు, టీఆర్ఎస్ అధినేత్రి కల్వకుంట్ల కవిత తమ సోషల్ మీడియా వేదికల ద్వారా విజయ్‌కు అభినందనలు తెలిపారు.

మాజీ మంత్రి హరీష్ రావు విజయ్‌ను అభినందిస్తూ.. తమిళనాడు రాజకీయాల్లో ఒక అద్భుతమైన ఆరంభాన్ని సాధించారని కొనియాడారు. “ఈ ప్రజా తీర్పు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. ప్రజా జీవితంలో విజయ్ ప్రారంభించిన ఈ ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను.” అని ఆయన ‘ఎక్స్’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

కల్వకుంట్ల కవిత తన ట్వీట్ లో తమిళ ప్రజల తీర్పును దేశానికి ఒక సంకేతంగా అభివర్ణించారు. “ఉన్న వాళ్లతో విసిగిపోయాం.. అధికార దాహార్తులతో వేసారిపోయాం.. భ్రష్టుపట్టిపోయిన ఈ రాజకీయ చరిత్రను తిరగరాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని దేశానికి తమిళ ప్రజలు ఒక స్పష్టమైన సంకేతం పంపారు.” అని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని, మార్పు కోసం వారు పడుతున్న ఆరాటాన్ని విజయ్ విజయం నిరూపించిందని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రవిడ పార్టీల ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ.. ఒక కొత్త పార్టీ మెజారిటీ దిశగా దూసుకుపోవడం సామాన్యమైన విషయం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో పొరుగు రాష్ట్రాల రాజకీయాల్లో కూడా ఇలాంటి మార్పులు సంభవించవచ్చనే ఆశాభావం కవిత మాటల్లో కనిపిస్తోంది.

Read Also: కన్నీళ్లు, కేరింతలు.. టీవీకే చీఫ్ విజయ్ ఇంట్లో సంబరాలు… వీడియో వైరల్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×