E-Paper
Advertisement

Harish Rao: బడ్జెట్‌లో హామీలకు నిధులు కేటాయించాల్సిందే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు నిప్పులు

Harish Rao: బడ్జెట్‌లో హామీలకు నిధులు కేటాయించాల్సిందే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు నిప్పులు
Advertisement

Harish Rao: సిద్దిపేటలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రజలకిచ్చిన హామీలకు స్పష్టమైన నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా.. సోనియా, రాహుల్ గాంధీలు బాండ్ పేపర్ల ద్వారా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నేటికీ అమలుకు నోచుకోలేదని విమర్శించారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న వాగ్దానాలు 800 రోజులైనా నెరవేరలేదని ఆయన ధ్వజమెత్తారు.

ముఖ్యంగా సామాజిక పింఛన్ల విషయంలో కాంగ్రెస్ వైఖరిని హరీష్ రావు ఎండగట్టారు. గతంలో కేసీఆర్ గారు పెంచిన పింఛన్‌ను తాము గెలిచిన మరుసటి నెల నుంచే రూ. 4వేలు చేస్తామని చెప్పి, 27 నెలలు గడుస్తున్నా అమలు చేయలేదని మండిపడ్డారు. వృద్ధులు, వితంతువులు, బీడీ, చేనేత, గీత కార్మికులందరికీ ఈ బడ్జెట్‌లో తక్షణమే నిధులు కేటాయించి పెంచిన పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు. అలాగే మహిళలకు నెలకు రూ. 2వేల 500 ఇస్తామని ఆశ చూపి ఓట్లు దండుకున్నారని.. ఇప్పటివరకు ఏ ఒక్క మహిళా ఖాతాలోనూ ఆ సొమ్ము జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

విద్యా, వ్యవసాయ రంగాల్లోనూ కాంగ్రెస్ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. ఎస్సీ, బీసీ డిక్లరేషన్ల ద్వారా విద్యార్థులకు పది నుంచి పీజీ వరకు ఇస్తామన్న నగదు ప్రోత్సాహకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని.. కనీసం కేసీఆర్ హయాంలో అమలైన ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిగ్గా అందడం లేదని విమర్శించారు. రైతులకు ఏటా రూ. 15వేలు రైతుబంధు, బోనస్, పంటల బీమా హామీలను ప్రభుత్వం విస్మరించిందని దుయ్యబట్టారు. అసెంబ్లీలో మాయ మాటలు చెప్పడం మాని.. రాబోయే బడ్జెట్‌ను వాస్తవికతకు దగ్గరగా రూపొందించి.. ఇచ్చిన ప్రతి హామీకి నిధులు కేటాయించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను హరీష్ రావు డిమాండ్ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×