E-Paper
Advertisement

Raghaverdar Reddy Condolences: బిగ్ టీవీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు.. చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి

Raghaverdar Reddy Condolences: బిగ్ టీవీ చైర్మన్ కుటుంబాన్ని పరామర్శించిన హరీష్ రావు.. చామల కిర‌ణ్ కుమార్ రెడ్డి
Advertisement

Raghaverdar Reddy Condolences: మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో బిగ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ చైర్మన్ వెన్నం విజయ్ కాంత్ రెడ్డి నివాసానికి రాజకీయ ప్రముఖుల తాకిడి పెరిగింది. విజయ్ కాంత్ రెడ్డి తండ్రి వెన్నం రాఘవేందర్ రెడ్డి గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, పలువురు బీఆర్ఎస్ నేతలు విజయ్ కాంత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు.

ముందుగా హరీష్ రావు కీర్తిశేషులు రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విజయ్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాఘవేందర్ రెడ్డి మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. హరీష్ రావు వెంట పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు.

Advertisement

మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా విజయ్ కాంత్ రెడ్డిని పరామర్శించారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు రెడ్యాలలోని విజయ్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రాఘవేందర్ రెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించి.. విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు తరలివచ్చి విజయ్ కాంత్ రెడ్డికి అండగా నిలబడటం విశేషం.

Advertisement

రాఘవేందర్ రెడ్డి గారు తన జీవితాంతం గ్రామంతో అనుబంధాన్ని కలిగి ఉండి.. వ్యవసాయంపై మక్కువతో ఇక్కడే గడిపిన తీరును నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వెన్నం సోదరులు తమ తండ్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×