E-Paper
Advertisement

‘సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు’.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్

‘సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారు’.. కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్
Advertisement

Harish Rao: 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణిని కుంభకోణాల గనిగా మార్చారని బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు మండిపడ్డారు. భూపాలపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సింగరేణి కార్మికుల సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. గతంలో ఫిక్స్ డ్ డిపాజిట్లతో కలకల లాడిన సింగరేణి నేడు అప్పులు ఊబిలో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ తన రెండున్నరేండ్ల పాలనలో కార్మికుల బతుకులను ఆగం పట్టించిందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దేనిని వదలడం లేదని అన్నిట్లో అవినీతి చేస్తోందని హరీశ్ రావు అన్నారు. సైట్ విజిట్ స్కాం, సోలార్ పవర్ స్కాం, జైపూర్ పవర్ స్కాం, 40 లక్షల బొగ్గు మాయం స్కాం, ఎక్సప్లోజివ్ స్కాం ఇలా అనేక స్కాంలు చేసారని ఆరోపించారు. శ్రీరాంపూర్ ఓసీ టెండర్ ను 7 సార్లు వాయిదా వేశారని హరీశ్ రావు అన్నారు. కమీషన్లు కుదరడం లేదని రేవంత్ బామ్మర్ది వాయిదా వేయించారని ఆరోపించారు. సింగరేణిని కాపాడుకునే ప్రయత్నం అంతా చేయాలని కార్మికులకు హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఇలానే ఉంటే మూడేళ్లలో ప్రవేటీకరణ ఖాయమని అన్నారు.

Advertisement

Also Read: తెలంగాణను ‘గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్’గా మారుస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

మరోవైపు కమిషన్ ల కోసమే సోలార్ ప్లాంట్లు పెడుతున్నారని హరీశ్ రావు అన్నారు. రూ.1000 కోట్ల సింగరేణి డబ్బును సోలార్ లో పెడితే అప్పు కాకుంటే ఏమైతది అని ప్రశ్నించారు. సోలార్ పవర్ కొనమని ట్రాన్స్కో స్పష్టంగా చెప్పినా రూ.1000 కోట్లను ప్రభుత్వం వృథా చేసిందని హరీశ్ రావు అన్నారు. ప్రశ్నిస్తే అడుగడుగున కేసులు పెట్టి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి పైసలు తీసుకుపోయి 800 మెగా వాట్ల ప్లాంట్ కట్టారంటూ మండిపడ్డారు. కమిషన్ ల కోసమే అడ్డగోలు కార్యక్రమాలకు తెరలేపారని అన్నారు.

Advertisement

Also Read: మ్యూజిక్ డైరెక్టర్‌ను ఇసుకలో పాతిపెట్టిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. షాకింగ్ వీడియో వైరల్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×