E-Paper
Advertisement

కమలాపూర్‌లో ప్రభుత్వ కాలేజీల ప్రభంజనం

కమలాపూర్‌లో ప్రభుత్వ కాలేజీల ప్రభంజనం
Advertisement

Hanumakonda: స్వేచ్ఛ బ్యూరో: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ చాటాయి. గౌట్ జూనియర్ కళాశాల విద్యార్థిని డి. శాన్విక, ఎంజెపి బాయ్స్ జూనియర్ కళాశాల విద్యార్థి డి. వినయ్ 993/1000 మార్కులు సాధించి మండల టాపర్లుగా నిలిచారు. మండలంలోని మోడల్ స్కూల్, ఎంజెపి గర్ల్స్, కస్తూర్బా గాంధీ బాలికల కళాశాల విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారు.

మోడల్ స్కూల్ ఫలితాలు

తెలంగాణ మోడల్ స్కూల్‌లో ప్రథమ సంవత్సరం 108 మంది పరీక్షలకు హాజరుకాగా 43 మంది ఉత్తీర్ణులై 40 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ద్వితీయ సంవత్సరంలో 99 మందిలో 49 మంది ఉత్తీర్ణులై 50 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో బి. వర్షిని 454/470 మార్కులతో కాలేజ్ టాపర్‌గా నిలిచింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో పి. సాత్విక 987/1000 మార్కులు సాధించింది.

Advertisement

Also Read: సొంత పార్టీ నేతలపై ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీలొకి భారీ వలసలంటూ..!

కేజీబీవీ లో మెరుగైన ఫలితాలు

కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలో ప్రథమ సంవత్సరం 69 మందిలో 60 మంది ఉత్తీర్ణులై 87 శాతం ఫలితాలు సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 57 మందిలో 48 మంది ఉత్తీర్ణులై 84 శాతం ఫలితాలు నమోదయ్యాయి. ప్రథమ సంవత్సరం ఎంపీసీలో టి. రేఖ 462/470 మార్కులు సాధించింది. ద్వితీయ సంవత్సరం ఎంపీసీలో సి.హెచ్. దివ్య 991/1000 మార్కులు సాధించగా, బైపీసీలో ఎ. అక్షిత 959/1000 మార్కులు సాధించింది. ఈ విజయానికి విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వమే కారణమని ప్రిన్సిపాళ్లు పి. కవితారెడ్డి, అనిత, అర్చన తెలిపారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అధ్యాపక బృందం అభినందించింది.

Advertisement

Also Read: బీఆర్ఎస్ నేతలకు చురకలంటించిన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×