E-Paper
Advertisement

Farmers: రైతులకు సంకెళ్లు.. ఖాకీల క్రూరత్వం..

Farmers: రైతులకు సంకెళ్లు.. ఖాకీల క్రూరత్వం..
Advertisement
farmers hand cuffs

Farmers protest news telangana(TS news updates): తెలంగాణలో రైతుల చేతులకు మరోసారి సంకెళ్లు పడ్డాయి. ఆనాడు ఖమ్మం.. ఇప్పుడు భువనగిరి. ఆ రైతులు చేసిన తప్పేమీ లేదు. తమ భూములు ప్రభుత్వానికి ఇవ్వమన్నందుకు.. మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకున్నందుకు.. ఆ రైతులపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. తాజాగా కోర్టుకు తీసుకెళ్లే సమయంలో.. ఇద్దరు రైతుల చేతులకు బేడీలు వేసి తమ క్రూరత్వాన్ని చాటుకున్నారు ఖాకీలు.

వాళ్లేమైనా ఉగ్రవాదులా? నేరగాళ్లా? హత్యలు చేశారా? దోపిడీలు చేశారా? తమ భూములు దోపిడీ కాకుండా ఆందోళన చేయడమే ఆ అన్నదాతలు చేసిన నేరమా? యాదాద్రి జిల్లా రాయగిరి ఆర్‌ఆర్‌ఆర్‌ రైతులకు పోలీసులు సంకెళ్లు వేసిన ఘటన సంచలనంగా మారింది.

Advertisement

అసలేం జరిగిందంటే…
మే 30న ట్రిపుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్చాలని యాదాద్రి జిల్లా కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు రైతులు. అక్కడకు వచ్చిన మంత్రి జగదీష్‌రెడ్డిని అడ్డుకోవడంతో.. ఆరుగురిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టారు పోలీసులు. నలుగురిని అరెస్ట్‌ చేసి.. అదే రోజు రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు రైతులు పరారీలో ఉన్నట్టు చెబుతున్నారు.

తమ అరెస్టుపై ఆ రైతులు కోర్టుకు వెళ్లడంతో వారికి బెయిల్ మంజూరైంది. అటు, 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ సైతం ముగిసింది. దీంతో ఆ నలుగురు రైతులను భువనగిరి కోర్టుకు తీసుకొచ్చే సమయంలో వాళ్లకు సంకెళ్లు వేయడం వివాదాస్పదంగా మారింది. పోలీసుల తీరుపై అన్నివర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా? అని నిలదీస్తున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×