E-Paper
Advertisement

నన్ను నమ్మితే.. బీఆర్ఎస్ ను పాతాళానికి తొక్కుతా.. గువ్వల బాలరాజు వార్నింగ్!

నన్ను నమ్మితే.. బీఆర్ఎస్ ను పాతాళానికి తొక్కుతా.. గువ్వల బాలరాజు వార్నింగ్!
Advertisement

Guvvala Balaraju: స్వేచ్ఛ బ్యూరో: మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ ను బీఆర్ఎస్ కన్ఫ్యూజ్ చేసిందని, బీజేపీ అధికారంలోకి రాదని, అందుకే రిటన్ వెళ్లిపోయారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరు కన్ఫ్యూజ్ చేసినా గువ్వల బాలరాజు కన్ఫ్యూజ్ కాడని వ్యాఖ్యానించారు. తాను చేసిన కామెంట్స్ పై హరీశ్ రావు స్పందించాలన్నారు.

ఎస్ఐఆర్ సదస్సుకు హరీశ్ రావు వచ్చి అచ్చంపేట ప్రజలకు తాము ఉన్నామని చెప్పారు. తపైన ఎవరు మాట్లాడినా వదలడని అందరికీ తెలుసన్నారు. అందుకే కేటీఆర్ అచ్చంపేటకి వచ్చి జాగ్రతగా మాట్లాడి వెళ్లారన్నారు. తనవెంట ఎవరు రాలేదని హరీశ్ రావు వెటకారంగా మాట్లాడుతున్నారని బాలరాజు చురకలంటించారు. తన వెంట ఎవరు వచ్చారనేది ఎన్నికల సమయంలో తెలుస్తుందన్నారు. అప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే గువ్వల గెలుస్తాడని ఒక సర్వే సంస్థ చెప్పిందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

తాను పార్టీ మారినా.. తరువాత సర్పంచ్ ఎన్నికలు వస్తే.. వారికి ఎవరు వచ్చి మద్దతు ఇవ్వలేదన్నారు. తన కుటుంబం చేసిన అక్రమాలనే రేవంత్ రెడ్డి కుటుంబం కూడా చేస్తోందని బాలరాజు మండిపడ్డారు. హరీష్ రావు, కేసీఆర్ ఇరిగేషన్ లో విఫలమయ్యారని గువ్వల మండిపడ్డారు. వారి అసమర్థతతోనే దుబ్బాకలో ఓడిపోయారన్నారు. ప్రతిపక్ష హోదాలో యుద్ధం చేద్దామన్నాడంటే.. లైట్ తీసుకోండి అని చెప్పారనే అర్థమన్నారు. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు పునాది రాయి వేయని పార్టీ బీఆర్ఎస్ అని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ సచ్చినా అధికారంలోకి రాదని గువ్వల బాలరాజు తెలిపారు.

గువ్వల బాలరాజు పిల్లోడు కాదని, చిచ్చర పిడుగని వ్యాని వ్యాఖ్యానించారు. తన గురించి మాట్లాఏ బీఆర్ఎస్ నేతలు ఎవరు మాట్లాడినా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. తనపై మాట్లాడే వారు తమ పార్టీకి కాకుండా పక్క పార్టీల వారికి ఫండ్ ఇచ్చి గెలిపించిన లిస్ట్ అంతా బయట పెడతాని గువ్వల హెచ్చరించారు. బీఆర్ఎస్ చేసిన రివర్స్ ఆపరేషన్ తో రాజకీయాలు మలినమయ్యాయని మండిపడ్డారు. తమ పార్టీకి తనపై నమ్మకం కలిగిందో లేదో తెలియదన్నారు. తమ పార్టీకి తనపై నమ్మకం వచ్చిన రోజు దూసుకుపొమ్మంటే.. బీఆర్ఎస్ ని పాతాళానికి తొక్కుతానని గువ్వల తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×