E-Paper
Advertisement

TSPSC : టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. కొత్త బోర్డుకు లైన్ క్లియర్..

TSPSC : జనార్ధన్ రెడ్డి సహా సభ్యుల రాజీనామాలకు గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. దీంతో త్వరలో నూతన ప్రభుత్వం కొత్త బోర్డు ఏర్పాటు చేయ్యనుంది. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తోంది. అయితే గతంలో పలు పరీక్షలు పూర్తయినా టీఎస్‌పీఎస్సీ ఫలితాలు ప్రకటించలేదు. కొత్తగా ఛైర్మన్‌, సభ్యుల నియామకం జరిగిన తర్వాత ఫలితాలు వెల్లడించే అవకాశముంది.

TSPSC : టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. కొత్త బోర్డుకు లైన్ క్లియర్..
Advertisement

TSPSC : టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి సహా బోర్డు సభ్యుల రాజీనామాలను గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. దీంతో త్వరలో ప్రభుత్వం కొత్త బోర్డును ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తోంది. గతంలో పలు పరీక్షలు పూర్తయినా.. టీఎస్‌పీఎస్సీ ఫలితాలు వెల్లడించలేదు. కొత్తగా ఛైర్మన్‌, సభ్యుల నియామకం జరిగిన తర్వాత ఫలితాలు వెల్లడించే అవకాశముంది.

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చాక కమిషన్‌ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. లక్షల మంది నిరుద్యోగుల జీవితాలకు సంబంధించిన అంశంలో ఛైర్మన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. ఛైర్మన్ పదవి నుంచి ఆయన్ను తొలగించాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. బోర్డును పూర్తిగా ప్రక్షాళన చేయాలని రాజకీయ పార్టీలు, నిరుద్యోగులు డిమాండ్‌ చేశారు.

Advertisement

ఈ పరిణామాలతో తన పదవికి రాజీనామా చేయాలని ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. అయితే ఆయన రాజీనామా నిర్ణయాన్ని అప్పటి బీఆర్‌ఆస్ ప్రభుత్వం తిరస్కరించింది. కమిషన్‌లో జరిగిన పొరపాట్లు సరిదిద్దాలని, సంస్కరణలను చేపట్టాలని గత ప్రభుత్వం ఛైర్మన్‌ను ఆదేశించింది. దీంతో రాజీనామా విషయంలో జనార్ధన్ రెడ్డి వెనక్కి తగ్గారు.

అయితే రెండోసారి నిర్వహించిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను హైకోర్టు రద్దు చేసింది. దీంతో కమిషన్‌పై నిరుద్యోగులు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ సహా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బోర్డును ప్రక్షాళన చేస్తామంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వం మారడంతో డిసెంబర్‌లో జనార్దన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై ఆమోదించారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×