E-Paper
Advertisement

ప్రభుత్వం పాఠశాలలో మెరిసిన ముత్యం.. బాసర ఐఐఐటీకి ఎంపికైన హుజూరాబాద్ విధ్యార్ధిని..?

ప్రభుత్వం పాఠశాలలో మెరిసిన ముత్యం.. బాసర ఐఐఐటీకి ఎంపికైన హుజూరాబాద్ విధ్యార్ధిని..?
Advertisement

Basara IIIT: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలలో చదివి, పట్టుదలతో శ్రమించిన ఒక గ్రామీణ విద్యార్థిని ప్రతిష్టాత్మక బాసర ఐఐఐటీ (IIIT) సీటు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. హుజూరాబాద్ మండలం ఇప్పల్ నర్సింగాపూర్ ఉన్నత ప్రాథమిక పాఠశాల (UPS)లో ప్రాథమిక విద్యనభ్యసించిన కళ్లెపు అభినయశ్రీ ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. గ్రామానికి చెందిన క్రాంతి కుమార్ కుమార్తె అయిన అభినయశ్రీ.. చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉంటూ ఉపాధ్యాయుల గుర్తింపు పొందింది.

Also Read: బడ్జెట్‌లో బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్ కావాలా? ట్రెండ్ అవుతున్న టాప్ 3 బ్రాండ్స్!

ఉపాధ్యాయుల ఘన సత్కారం

Advertisement

పరిమిత వసతుల మధ్య ప్రభుత్వ బడిలో చదివి ఐఐఐటీ సీటు కైవసం చేసుకున్న అభినయశ్రీని ఇప్పల్ నర్సింగాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అభినయశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులను శాలువాతో సన్మానించి, మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రతిభకు ఈ విజయమే నిదర్శనమని, తోటి విద్యార్థులకు అభినయశ్రీ ఆదర్శంగా నిలిచిందని ఉపాధ్యాయులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read: టాటా మోటార్స్ మాస్టర్ ప్లాన్.. అవిన్యా X లాంచింగ్ డేట్ ఫిక్స్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×