E-Paper
Advertisement

Good News for RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్

Good News for RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. DA చెల్లింపుకు గ్రీన్ సిగ్నల్
Advertisement

DA Update for Telangana RTC Employees: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. 43.2 శాతం కరవు భత్యం (Dearness Allowance) చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. వేతన సవరణ తర్వాత ఉండే మూతవేతనంపై ఉద్యోగుల డీఏను లెక్కించి.. దానిని జీతంలో భాగంగా చెల్లించనున్నారు అధికారులు. హెచ్ఆర్ఏ(HRA – House Rent Allowance)లో కోత విధించడంతో నిరాశలో ఉన్న ఉద్యోగులకు దీంతో కాస్త ఊరట లభించినట్లైంది. జీతం పెరిగినా.. ఆశించిన స్థాయిలో చేతికి రాకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందారు. ఈ మేరకు ప్రభుత్వం త్వరలోనే ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండగా.. ఆర్టీసీ ఉద్యోగులకు అన్ని విడతల డీఏలను చెల్లిస్తుండటం విశేషమనే చెప్పాలి. ఏడు విడతల డీఏ బకాయిలు పేరుకుపోయి ఉండగా.. కార్మిక సంఘాలు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కృషితో తక్కువ సమయంలోనే ప్రభుత్వం డీఏ బకాయిలను చెల్లించింది.

Also Read: అమ్మో ఎండలు.. తెలంగాణలో 2 డిగ్రీల మేర పెరగనున్న ఉష్ణోగ్రతలు

Advertisement

ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల డీఏ 82.6 శాతం ఉన్నా.. 2017 ఏప్రిల్ నాటి వేతన సవరణనే అమల్లోకి తీసుకొస్తుంది. దీంతో ఉద్యోగుల 31.1 శాతం డీఏ మూలవేతనంలో కలిసిపోతుంది. అంటే ఇంకా 51.5 శాతం డీఏ బకాయిలుంటాయి. దీనిని న్యూట్రలైజ్ చేసి కొత్త డీఏను 43.2 శాతంగా ఖరారు చేశారు. ఈ మొత్తాన్ని ఆర్టీసీ ఉద్యోగులకు చెల్లిస్తే.. మొత్తం డీఏ బకాయిలు క్లియర్ అవుతాయి.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×