E-Paper
Advertisement

Telangana Govt: మొంథా తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్.. పరిహారం విడుదల చేసిన రేవంత్ సర్కార్

Telangana Govt: మొంథా తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్.. పరిహారం విడుదల చేసిన రేవంత్ సర్కార్
Advertisement

Telangana Govt: భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మొంథా తుఫాన్ (Montha Cyclone) కారణంగా సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తుఫాన్ బాధితుల సహాయార్థం మొత్తం రూ.12 కోట్ల 12 లక్షల నష్టపరిహారాన్ని విడుదల చేస్తూ పరిహార ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నిధులు ప్రధానంగా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు.

మొంథా తుఫాన్ ప్రభావం తెలంగాణపై చాలా తీవ్రంగా పడింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్, హనుమకొండ నగరాల్లో భారీ వర్షాలు, వరదలు జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జిల్లాలో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అనేక చోట్ల ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేసిన ప్రభుత్వం, నష్టాన్ని అంచనా వేసి తక్షణమే పరిహారాన్ని విడుదల చేసింది.

Advertisement

ముఖ్యంగా.. వరద ప్రభావాన్ని ఎదుర్కొన్న వరంగల్, హనుమకొండ కార్పొరేషన్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. వరంగల్ నగరంలో మొత్తం 3,368 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం అయినట్లు అధికారులు గుర్తించారు. ఈ బాధితులకు ఇంటికి రూ.15,000 చొప్పున పరిహారం చెల్లించడానికి గాను ప్రభుత్వం రూ.5,05,20,000 (ఐదు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు) విడుదల చేసింది. అలాగే, హనుమకొండ నగరంలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది.. ఇక్కడ ఏకంగా 4,691 ఇళ్లు పాక్షికంగా ధ్వంసం కాగా.. ఇక్కడి బాధితుల కోసం నష్టపరిహారం కింద రూ.7,03,65,000 (ఏడు కోట్ల మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలు) నిధులను రేవంత్ సర్కార్ విడుదల చేసింది. ఈ భారీ మొత్తాల విడుదల ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వేలాది బాధితులకు తక్షణ ఆర్థిక ఊరటనిచ్చినట్లయింది.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రధాన నగరాలతో పాటు.. ఇతర ప్రాంతాలలో కూడా పాక్షికంగా ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇందులో భాగంగా.. మహబూబాబాద్ జిల్లాలో దెబ్బతిన్న 16 ఇళ్లకు గాను ఒక్కొక్క ఇంటికి రూ.15,000 చొప్పున మొత్తం రూ.2,40,000 (రెండు లక్షల నలభై వేల రూపాయలు) పరిహారం అందించారు. అదేవిధంగా.. ములుగు జిల్లాలో ధ్వంసమైన 5 ఇళ్లకు గాను రూ.75,000 (డెబ్బై ఐదు వేల రూపాయలు) విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు త్వరగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది.

Advertisement

మొత్తం మీద.. మొంథా తుఫాన్ బాధితుల సహాయార్థం రూ.12 కోట్ల 12 లక్షల పరిహారాన్ని విడుదల చేయడం ద్వారా.. రేవంత్ సర్కార్ ప్రజలకు తాము అండగా ఉంటామని మరోసారి నిరూపించింది. పంట నష్టపోయిన రైతులకు కూడా ఎకరాకు రూ.10,000, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం, నష్ట అంచనాలను మరింత వేగవంతం చేసి మిగిలిన సహాయాన్ని కూడా త్వరలోనే అందజేస్తామని భరోసా ఇచ్చింది.

ALSO READ: Maoist Hidma: నువ్వు ఏడున్నవ్ బిడ్డా.. ఇంటికి వచ్చేయ్.. నీకోసం ఎదురుచూస్తున్న, హిడ్మా తల్లి ఆవేదన

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×