E-Paper
Advertisement

ప్రజా భవన్ లో ‘వార్ రూమ్’.. పుష్కరాల విషయంలో రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

ప్రజా భవన్ లో ‘వార్ రూమ్’.. పుష్కరాల విషయంలో రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!
Advertisement

Pushkaralu 2027: స్వేచ్ఛ బ్యూరో: పుష్కరాలు –2027 నిర్వహణకు ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి 15 నుంచి 20 రోజుల్లో ప్రభుత్వానికి ఓ రిపోర్టు ఇవ్వనున్నది. ఘాట్స్ ఏర్పాటు, టెంపుల్స్ నిర్వహణ, తదితరవన్నింటిపై ఈ కమిటీ తన నివేదికలో పేర్కొననున్నాయి. కేబినెట్ ఆమోదం తర్వాత పుష్కరాల ఏర్పాట్లు స్పీడప్ కానున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా రివ్యూ నిర్వహించారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి పరివాహక ప్రధాన ఆలయాలు, పుష్కర ఘాట్ల అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు.

పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి రూపొందించిన ప్రణాళికలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… శాశ్వత, తాత్కాలిక పనులను ప్రాధాన్యతల వారీగా పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వివిధ విభాగాల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ప్రజా భవన్ లో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Advertisement

రోడ్లు, వివిధ ప్రాంతాల మధ్య కనెక్టివిటీ విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా, పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా ప్రధాన దేవాలయాలు, పర్యాటక ప్రదేశాల్లో ఘాట్ల నిర్మాణం, విస్తరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాంతాలను సందర్శించే భక్తులు, పర్యాటకులకు ఇబ్బందులు రాకుండా ప్రాంతాల మధ్య కనెక్టివిటీ సరిగా ఉండేలా చూసుకోవాలని చెప్పారు.బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం అభివృద్ధి, ఆలయ విస్తరణకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను ఈ సందర్భంగా అధికారులు వివరించగా, ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండా సురేఖ , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , తుమ్మల నాగేశ్వర రావు , పొన్నం ప్రభాకర్ , అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి , ఇతర ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: రేవంత్ రెడ్డి సంకల్పాన్ని అడ్డుకోవడం ఎవరితరం కాదు.. అభివృద్ధిపై ఎంపీ ధీమా!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×