E-Paper
Advertisement

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాల డేట్ ఫిక్స్.. ప్రభుత్వం ఏం చేయబోతుందంటే?

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాల డేట్ ఫిక్స్.. ప్రభుత్వం ఏం చేయబోతుందంటే?
Advertisement

Godavari Pushkaralu 2027: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నాడు మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గోదావరి పుష్కరాల నిర్వహణపై క్యాబినెట్ సబ్ కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరిగే ఈ ‘ఆది పుష్కరాలను’ అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ పుష్కరాల ఏర్పాట్లలో రోడ్లు , భవనాల శాఖ కీలక పాత్ర పోషించనుంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా హ్యామ్ (HAM) మోడల్ రోడ్ల కనెక్టివిటీతో పాటు, అవసరమైన చోట కాంక్రీట్ రోడ్లు , పటిష్టమైన పుష్కర ఘాట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా కందకుర్తి నుండి భద్రాచలం వరకు ఉన్న వందల కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలోని ఆధ్యాత్మిక కేంద్రాలైన బాసర, ధర్మపురి, మంథని, కాళేశ్వరం వంటి క్షేత్రాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

Advertisement

కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కమిటీ సూచించింది. వాహనాల రాకపోకలు, పార్కింగ్ సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని.. వచ్చే సమావేశం నాటికి అన్ని శాఖల అధికారులు ,పోలీసు యంత్రాంగం సమన్వయంతో పూర్తిస్థాయి రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. అదేవిధంగా తాగునీరు, పారిశుధ్యం , విద్యుత్ సరఫరాలో ఎక్కడా లోటు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు.

తెలంగాణ గంగానదిగా పిలవబడే గోదావరి నది పుష్కరాలను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, టెంపుల్ టూరిజానికి ప్రాధాన్యతనిస్తూ నిర్వహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రులు స్పష్టం చేశారు.

Advertisement

Also Read: బాంబుల మోత.. పవన్ గారు కాపాడండి! కువైట్ నుండి మహిళ వీడియో!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×