E-Paper
Advertisement

Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ వ్యూహాం ఇదే..?

Property Tax: ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై జీహెచ్ఎంసీ వ్యూహాం ఇదే..?
Advertisement

Property Tax: స్వేఛ్చ బ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ పై స్పెషల్ గా ఫోకస్ పెట్టింది. ఇటీవలే జీహెచ్ఎంసీ పరిధి, విస్తీర్ణం పెరగటంతో తొలుత రూ. 2200 కోట్ల ట్యాక్స్ కలెక్షన్ ను టార్గెట్ గా పెట్టుకున్న అధికారులు టార్గెట్ ను రూ. 700 కోట్లు పెంచి మొత్తం రూ. 3 వేల కోట్ల వసూళ్లను లక్ష్యంగా పెట్టుకుంది. గత సంవత్సరం ఏప్రిల్ మాసంలో అమలు చేసిన ఎర్లీ బర్డ్ స్కీమ్ మొదలుకుని నిన్నమొన్నటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో రూ. 1965 కోట్ల వరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కాగా, టార్గెట్ కు తగిన విధంగా ట్యాక్స్ ను వసూలు చేసుకునేందుకు వీలుగా ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, బిల్ కలెక్టరకు ఉన్నతాధికారులు డైలీ ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్లు ఫిక్స్ చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ ఆస్తుల వివరాలతో కూడిన డాకెట్లు 345 వరకుండగా, ఇపుడు అదనంగా 254 డాకెట్లు పెరగటంతో, ఆ డాకెట్లకు కూడా ఇన్ ఛార్జి బిల్ కలెక్టర్లను నియమించిన జీహెచ్ఎంసీ వారు కూడా ట్యాక్స్ కలెక్షన్ ను ముమ్మరం చేసేందుకు వీలుగా వారికి హ్యాండ్ హెల్డ్ మిషన్ల పంపిణీని చేపట్టింది.

రూ. 1035 కోట్లలో..

మిషన్ల పంపిణీ ప్రక్రియ ముగియటంతో డాకెట్లలోని ఆస్తుల సంఖ్యను బట్టి వారికి కూడా డైలీ కలెక్షన్ టార్గెట్లను విధించినట్లు తెలిసింది. ఇప్పటి వరకు రూ. 1965 కోట్ల మేరకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు కాగా, టార్గెట్ చేరుకునేందుకు ఇంకా మిగిలి ఉన్న రూ. 1035 కోట్లలో ఈ నెలాఖరు కల్లా అన్ని సర్కిళ్లలో కలిపి సుమారు రూ. 600 కోట్ల వరకు ట్యాక్స్ వసూలు చేయాలన్న లక్ష్యాన్ని విధించినట్లు తెలిసింది. టార్గెట్ ను చేరేందుకు మెలిగిన రూ. 1035 కోట్లలో సింహాభాగం కలెక్షన్ మార్చి నెల ఫస్ట్ నుంచి నెలాఖరు వరకు వచ్చే అవకాశాలుండటంతో ప్రస్తుతం అమల్లో ఉన్న వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ పై బకాయిదారులకు అవగాహన కల్పించి, బకాయిలు చెల్లిస్తే వారికి జరిగే 90 శాతం వడ్డీ మాఫీ గురించి వివరించి, వారు ట్యాక్స్ చెల్లించేల మోటివెట్ చేయాలని అధికారులు ట్యాక్స్ స్టాఫ్ కు సూచించారు.

Advertisement

Also Read: Highway Robbery: హైవేపై భారీ దోపిడి.. రన్నింగ్ ట్రక్ నుంచి.. ఫ్లిప్‌కార్ట్ ఫోన్లు దోచేశారు!

1వ తేదీ నుంచి వన్ పాయింట్ ప్రొగ్రామ్‌గా..

వర్తమాన ఆర్థిక సంసత్సరం(2025-26) చివరి మాసమైన మార్చి నెల ప్రారంభం నుంచే ట్యాక్స్ కలెక్షన్ ను వన్ పాయింట్ ప్రొగ్రామ్ గా చేపట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. ఇప్పటికే కరెంట్ ఈయర్ బకాయిలు, మొండి బకాయిలు చెల్లించాలని సూచిస్తూ ప్రచార సామాగ్రిని సిద్దం చేస్తున్న జీహెచ్ఎంసీ ఈ నెల చివరి వారంలో మొండి, జగమొండి బకాయిలకు రెడ్ నోటీసులు జారీ చేసి, బకాయిదారుల నుంచి ట్యాక్స్ వసూలు చేసుకునేందుకు నేరుగా డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారులను సంప్రదింపులు జరిపేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో పేరుకుపోయిన మొండి బకాయిలను సర్కిళ్ల వారీగా గుర్తించి, రెడ్ నోటీసులు జారీ చేసిన తర్వాత డిప్యూటీ కమిషనర్లకు కూడా డైలీ ట్యాక్స్ కలెక్షన్ కు సంబంధించిన టార్గెట్లను ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Also Read: Gadwal Municipality: గద్వాల్లో రగులుతున్న విచిత్ర రాజకీయం.. కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×