E-Paper
Advertisement

తెలంగాణ మున్సిపాలిటీల్లో ఓటీఎస్ స్కీమ్ అమలుకు గ్రీన్ సిగ్నల్.. ఇక పండగే..!

తెలంగాణ మున్సిపాలిటీల్లో ఓటీఎస్ స్కీమ్ అమలుకు గ్రీన్ సిగ్నల్.. ఇక పండగే..!
Advertisement

Property Tax: స్వేచ్ఛ బ్యూరో: సుమారు పది, పదిహేనేళ్ల నుంచి పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను చెల్లించేందుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో సుముఖతను వ్యక్తం చేయటంతో ఏళ్లుగా పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను జీహెచ్ఎంసీ అధికారులు ఎట్టకేలకు వసూలు చేసుకున్నట్టయింది. క్యూర్ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న వివిధ ప్రభుత్వ కార్యాలయాలు పన్నులను క్లియర్ చేరుకునేందుకు వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) వెసులుబాటు కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలిసింది.

సర్కారుకు రూ. 4178 కోట్లు..

ఇప్పటి వరకు దాదాపు రూ. 5864 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలున్నాయి. జరిమానాలు, వడ్డీలన్నీ మినహాయించి వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.1686 కోట్లకు తగ్గుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినట్లు, పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ ను సర్కారు వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) స్కీమ్ కింద చెల్లించటంతో సర్కారుకు రూ. 4178 కోట్లు ఆదాయ అయ్యాయి. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలోనే వన్ టైమ్ సెటిల్మెంట్ పై ఈ బకాయిలు వసూలు చేసుకోవాలని మున్సిపల్ శాఖను ఆదేశించినట్లు తెలిసింది.

Advertisement

Also Read: హైదరాబాద్ vs తెలంగాణ క్రికెట్ అసోసియేషన్.. ముదురుతున్న లీగ్ వివాదం.. రంగంలోకి బీసీసీఐ!

దాదాపు 4 వేల వరకు..

హైదరాబాద్ జల మండలికి ఇవ్వాల్సిన నీటి బకాయిలను కూడా సర్దుబాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ పరిధిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన భవనాలకు సంబంధించి గతేడాది వరకు దాదాపు రూ. 11668 కోట్ల ట్యాక్స్ బకాయిలుండగా, ఇందులో స్టేట్ గవర్నమెంట్ కు చెందిన భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ సుమారు రూ. 5864 కోట్లున్నట్లు ప్రభుత్వం లెక్కలు తీసి, చెల్లించేందుకు సిద్దమైనట్లు సమాచారం. సెంట్రల్ గవర్నమెంట్ కు చెందిన సుమారు 600 ఆస్తులున్నట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన దాదాపు 4 వేల వరకు ఆస్తులున్నట్లు సమాచారం. దీర్ఘకాలంగా పేరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేయటంతో త్వరలోనే జీహెచ్ఎంసీ ఖజానాకు చెల్లింపులు జరుగుతాయని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తుండగా, ఇక సెంట్రల్ గవర్నమెంట్ ఆస్తుల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు ఎపుడు వసూలవుతాయో వేచి చూడాలి.

వినియోగాన్ని బట్టి ట్యాక్స్ వర్తింపు..

Advertisement

జీహెచ్ఎంసీ పరిధిలోనున్న సెంట్రల్ గవర్నమెంట్ కు చెందిన ఆస్తులకు వాటి వినియోగాన్ని బట్టి పన్ను అని కాకుండా, యూజర్ ఛార్జీలుగా వసూలు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలున్నట్లు సమాచారం. వీటిలో చాలా వరకు ఆస్తులు వినియోగించకుండా ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన దాదాపు 600 ఆస్తుల్లో అత్యధిక శాతం ఆస్తులు వినియోగించుకుండా ఉండటంతో వీటి నుంచి వసూలు చేయనున్న యూజర్ ఛార్జీలు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు అధికారులు అంఛనాలేస్తున్నారు.

Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×