E-Paper
Advertisement

GHMC Meeting: జీహెచ్‌ఎంసీ మీటింగ్‌లో ఉద్రిక్తత.. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్

GHMC Meeting: జీహెచ్‌ఎంసీ మీటింగ్‌లో ఉద్రిక్తత.. మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ డిమాండ్
Advertisement

GHMC council Meeting updates(Hyderabad news today): హైదరాబాద్‌లో శనివారం జరిగిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ రసాభాసగా కొనసాగుతోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కార్పొరేటర్ల ఆందోళనతో జీహెచ్‌ఎంసీ సమావేశం ఉద్రిక్తతగా మారింది. ఈ తరుణంలో మేయర్, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ కార్పొరేటర్లపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు మేయర్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు.

ఫిరాయింపులను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహించిందని మేయర్ విజయలక్ష్మి వెల్లడించారు. సంతాప తీర్మానానికి కూడా అడ్డుపడుతున్నారని మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మేయర్ పోడియం చుట్టూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు చుట్టుముట్టారు. దీంతో వాగ్వాదానికి దారితీసింది.

Advertisement

అంతకుముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేయడంతో 15 నిమిషాల పాటు సమావేశాన్ని వాయిదా వేశారు. కాగా, బీఆర్ఎస్ కార్పొరేటర్ల మద్దతుతో గద్వాల్ విజయలక్ష్మి మేయర్‌గా, మోతె శ్రీలత డిప్యూటీ మేయర్‌ అయ్యారు.

వాయిదా తర్వాత తిరిగి సమావేశం ప్రారంభమైంది. అయితే కార్పొరేటర్లు తమ స్థానాల్లో కూర్చోకపోవడంతో మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని మేయర్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.

Advertisement

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ విజయలక్ష్మి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఆమెతోపాటు డిప్యూటీ మేయర్ సైతం పార్టీ మారారు. దీంతో ఇద్దరిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అయితే కాంగ్రెస్‌లోకి చేరిక తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Also Read: ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ రైలు వీల్ బ్రేక్ ఫెయిల్.. తప్పిన ప్రమాదం!

జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా.. మరో ఇద్దరు ఎర్రగడ్డ, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు చనిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కార్పొరేటర్లు 47మందితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు. ఎంఐఎం 41, బీజేపీ 39, కాంగ్రెస్ 19 మంది సభ్యులు ఉన్నారు.

 

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×