E-Paper
Advertisement

GHMC: బల్దియా పై సర్కార్ కీలక నిర్ణయం.. ఆస్తుల పంపకాలకు ప్రత్యేక కమిటీ!

GHMC: బల్దియా పై సర్కార్ కీలక నిర్ణయం.. ఆస్తుల పంపకాలకు ప్రత్యేక కమిటీ!
Advertisement

GHMC: స్వేఛ్చ బ్యూరో: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ గా అవతరించిన జీహెచ్ఎంసీని త్వరలోనే మూడు కార్పొరేషన్లుగా విభజించేందుకు కసరత్తు కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థల విలీనంతో పరిధి సుమారు 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2 వేల 53 కిలోమీటర్లకు పెరగటంతో సర్కిళ్లు, జోన్లు, మున్సిపల్ వార్డులు రెండింతలకు పెరిగిన సంగతి తెల్సిందే. జీహెచ్ఎంసీ పాలక మండలి అధికార గడువు ముగిసిన తర్వాత ఈ నెల 11న మూడు కార్పొరేషన్లు విభించే అంశంపై సర్కారు క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. పట్టణ స్థానిక సంస్థల విలీనం, ఆ తర్వాత పునర్విభజన అంశాలకు సంబంధించి నియమించిన కమిటే మూడు కార్పొరేషన్లుగా విభజించే అంశాన్ని డీల్ చేస్తున్నట్లు తెలిసింది. పెద్ద కార్పొరేషన్ గా కాకుండా, అధికార వికేంద్రీకరణ చేసి త్వరలోనే మూడు కార్పొరేషన్ల ఏర్పాటుకు సర్కారు అనుకూలమైన ఆదేశాలిచ్చిన తర్వాత మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన సరిహద్దులు, ఆస్తులు, అప్పులకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశముంది.

అప్పుల పంపకాలే కీలకం

యూఎల్ బీల విలీనం, పునర్విభజన తర్వాత శంషాబాద్ వరకు విస్తరించిన జీహెచ్ఎంసీని 150 వార్డులతో కొనసాగిస్తూ, మిగిలిన 150 వార్డుల్లో 74 వార్డులతో గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మరో 76 వార్డులతో గ్రేటర్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ లుగా విభజించే ప్రక్రియలో జీహెచ్ఎంసీకి ప్రస్తుతమున్న అప్పుల పంపకాలే కీలకం కానున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ రూ. వేల కోట్ల అప్పులు చేసినపుడు. జీహెచ్ఎంసీ పరిధిలో లేని ప్రస్తుతం విలీన పట్టణ స్థానిక సంస్థలకు ఏం సంబంధమని, తమకు అప్పుల్లో ఎలా వాటా పంపిణీ చేస్తారంటూ విలీన యూఎల్ బీ పరిధిలోని వివిధ వర్గాల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisement

Also Read: Mrithyunjay: శ్రీవిష్ణు సినిమా నుంచి హీరోయిన్ లుక్కొచ్చింది.. మేడమ్ చాలా స్ట్రిక్ట్!

కొత్తగా విలీనమైన ప్రాంతాలపై..

మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియను బౌగోళికంగా, పౌర సేవల పరంగా చాలా ఈజీగా విభజించేలా ఇప్పటికే జీహెచ్ఎంసీ పునర్ వ్యవస్థీకరణ ప్రక్రియను ముగించినట్లు తెలిసింది. కానీ మూడు కార్పొరేషన్లకు ప్రస్తుతమున్న రూ. 4786 కోట్ల అప్పులను పంచటమే అతి ముఖ్యమైన, కీలకమైన ప్రక్రియగా అధికారులు భావిస్తున్నారు. అప్పులు చేసి పాత జీహెచ్ఎంసీ పరిధిలో అభివృద్ది చేపట్టినానంతరం కొత్తగా విలీనమైన ప్రాంతాలపై అప్పుల భారాన్ని మోపటంపై ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతిని ముందుగానే గుర్తించిన అధికారులు ఇందుకు ఓ కమటీని నియమించనున్నారు. మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయనున్న కార్పొరేషన్ల సరిహద్దులు, బౌగోళిక స్వరూపం, ఆదాయం, జనాభా కార్పొరేషన్ ఆస్తులు వంటి వాటిని విభజించే మాట అలా ఉంచితే, మూడు కార్పొరేషన్లలో ఏ కార్పొరేషన్ కు ఎంత అప్పుల వాట కేటాయించాలన్న అంశంపై సర్కారుదే తుది నిర్ణయమని అధికారులు భావిస్తున్నారు.

బృహత్ బెంగళూరు తరహాలో వికేంద్రీకరణ

Advertisement

ప్రస్తుతం 300 వార్డులతో కొనసాగుతున్న జీహెచ్ఎంసీని 150 వార్డులతో కొనసాగిస్తూ, అదనంగా ఏర్పడనున్న రెండు కార్పొరేషన్ల ఏర్పాటును బృహత్ బెంగళూరు తరహాలో వికేంద్రీకరించాలని అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. బృహత్ బెంగళూరు సైతం మూడు కార్పొరేషన్లుగా కొనసాగుతున్నట్లు, పెద్దన్నయ్య పాత్ర పోషించ సింహాభాగం కార్పొరేషన్ కు చీఫ్ కమిషనర్, అదనంగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లకు కమిషనర్లు కొనసాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మూడు ముక్కలకు ఒకే మేయర్ కొనసాగేలా నిర్ణయం తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇదే తరహాలో జీహెచ్ఎంసీ పరిధిని కూడా మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్లు సమాచారం.

Also Read: Lord Anjaneya Swamy: ఆంజనేయ స్వామికి ఆ ఒక్క పూజ చేస్తే చాలు – అష్టైశ్వర్యాలు వరిస్తాయట

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×