E-Paper
Advertisement

GHMC: ఓకే ఒక్క స్కాన్‌తో.. జీహెచ్ఎంసీ అన్ని సర్వీసులు మీ సొంతం..?

GHMC: ఓకే ఒక్క స్కాన్‌తో.. జీహెచ్ఎంసీ అన్ని సర్వీసులు మీ సొంతం..?
Advertisement

GHMC: అందుబాటులోనున్న టెక్నాలజీని వినియోగించుకుని గ్రేటర్ వాసులకు అతి సులువుగా,మెరుగైన, పారదర్శకమైన వేగవంతమైన సేవలందించేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. ఒక్క స్కాన్ తోనే అన్ని రకాల పౌర, అత్యవసర సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేయనుంది. ఇందుకు గాను గుర్ గావ్ లో అమలవుతున్న ఈ క్యూ ఆర్ కోడ్ స్కాన్ సిస్టమ్ పై గత సంవత్సరం జీహెచ్ఎంసీ అధికారులు అధ్యయనం చేసి, ఇపుడు ఆ విధానాన్ని నగరంలో అమలు చేసేందుకు సిద్దమైనట్లు తెలిసింది. తొలి దశగా పైలట్ ప్రాజెక్టుగా ఇంటింటికి క్యూ ఆర్ కోడ్ స్కాన్ ను కేటాయించి ఈ సేవలందించేందుకు తొలుత నాలుగు మున్సిపల్ వార్డులో ఈ పైలట్ ప్రాజెక్టును నేటి నుంచి మొదలు పెట్టనున్నట్లు తెలిసింది.

అన్ని సేవలను లింక్ చేసే ఆలోచన..

ఆదివారం నేటి నుంచి కైతలాపూర్, రాజేంద్రనగర్, వనస్థలిపురం మున్సిపల్ వార్డుల్లోని అన్ని ఇండ్లకు స్పెషల్ క్యూ ఆర్ కోడ్ స్కానర్లను అన్ని నివాసయోగ్యమైన భవనాలకు కేటాయించనున్నారు. ఈ క్యూ ఆర్ కోడ్ తో తొలుత శానిటేషన్ సేవలను అందుబాటులోకి తెచ్చి, ఆ తర్వాత అన్ని సేవలను లింక్ చేసే ఆలోచనలో జీహెచ్ఎంసీ అధికారులున్నట్లు తెలిసింది. మూడు వార్డుల్లో ఈ పైలట్ ప్రాజెక్టు మంచి ఫలితాలనిస్తే, మున్ముందు మొత్తం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ఉన్న్ర 150 మున్సిపల్ వార్డుల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

ఫస్ట్ శానిటేషన్ పైనే ఫోకస్..

Advertisement

జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే ఎంపిక చేసిన నాలుగు మున్సిపల్ వార్డుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ ను ఏర్పాటు చేయనున్న అధికారులు ఈ స్కాన్ ను స్కాన్ చేస్తే ఆ ఇంటికి చెత్త సేకరించేందుకు స్వచ్ఛ టిప్పర్ ఆటో వచ్చిందా? లేదా? అన్న విషయం తెలుస్తుందని, దీంతో నూటికి నూరు శాతం చెత్త డోర్ టూ డోర్ కలెక్షన్ మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. సదరు ఇంటికి ఒక వేళ చెత్తను సేకరించేందుకు స్వచ్ఛ టిప్పర్ ఆటో అటెండ్ చేయని పక్షంలో అప్పటికపుడే సమీపంలోనున్న స్వచ్ఛ టిప్పర్ ఆటోను రప్పించి, చెత్త సేకరించేందుకు వీలు కల్గుతుందని, ఆ ఇంటి నుంచి చెత్తను సేకరించేందుకు వెళ్లాల్సిన స్వచ్ఛ టిప్పర్ ఆటో ఎందుకు వెళ్లేదు, దానికి కారణాలను గుర్తించి, సదరు స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుడిని అందుకు బాధ్యులను చేసి తగిన చర్యలు తీసుకునే వీలు కల్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: Srisailam VIP cottage: శ్రీశైలం వీఐపీ కాటేజీలో అగ్నిప్రమాదం.. పేలిన ఏసీ, పరుగులు తీసిన భక్తులు

యజమాని వివరాలతో..

Advertisement

ఈ రకంగా తొలుత శానిటేషన్ సేవలను అందించి, నూటికి నూరు శాతం చెత్తను డోర్ టూ డోర్ సేకరణ సాధించాలని అధికారులు భావిస్తున్నారు. మున్ముందు ఇదే స్కానర్ కు సదరు ఇంటి నెంబర్ సహాయంతో బర్త్, డెత్ సర్టిఫికెట్లతో పాటు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించేలా అప్ డేట్ చేయనున్నట్లు తెలిసింది. ఇప్పటికే తుది దశకు చేరిన జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సర్వే (జీఐఎస్) తో సేకరించిన డేటాను ఈ స్కానర్ కు లింకు చేసి, ఒక్కో ఇంటి వివరాలను సర్వర్ లో పొందుపర్చనున్నారు. మున్ముందు ఈ ఇంటి స్కానర్ ను స్కాన్ చేస్తే ఆ ఇంటి స్థలం, వినియోగం, ప్రాపర్టీ ట్యాక్స్ తో పాటు యజమాని వివరాలతో పాటు కరెంట్, వాటర్ బిల్లులు క్యాటగిరీలు కూడా తెలిసే అవకాశాలుండేలా ఈ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు అధికారులు సిద్దమైనట్లు తెలిసింది.

సత్వరమే అత్యవసర సేవలందించేందుకు..

ప్రస్తుతం మూడు మున్సిపల్ వార్డుల్లోని ప్రతి ఇంటికి ఓ స్కానర్ ను, దానికి ఓ యూనిక్ నెంబర్ ను కేటాయించి శానిటేషన్ సేవలను అందించేలా మొదలు పెట్టనున్న ఈ విధానాన్ని మున్ముందు సదరు ఇంటికి ప్రకృతి వైపరీత్యాలు, విపత్కర పరిస్థితులు చోటుచేసుకున్నపుడు ఆ ఇంటికి కేటాయించిన స్కానర్, యునిక్ నెంబర్ తో జీఐఎస్ సర్వే డేటాను లింక్ చేసే క్షణాల్లో అత్యవసర సేవలను అందించే ఆస్కారమేర్పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతకు ముందు స్కానర్, యునిక్ నెంబర్లతో పాటు ప్రతి ఇంటికి ఓ ఇంటి నెంబర్ ను అనుసంధానం చేసిన గూగుల్ మ్యాప్ ద్వారా లోకేషన్ ను ట్రేస్ చేసి అత్యవసర సేవలను అందించేలా ఈ విధానాన్ని ఆధునీకరించాలని అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. మున్ముందు జీహెచ్ఎంసీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేసే పని లేకుండా ఒకే స్కానర్ తో అన్ని రకాల డిజిటల్ సేవలను అందించేందుకు ఈ పైలట్ ప్రాజెక్టు పునాది కానున్నట్లు తెలిసింది.

Also Read: KTR: అంతర్జాతీయ వేదికపై రాజకీయ నాటకాలా.. కేటీఆర్ ఫైర్..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×