E-Paper
Advertisement

Kachiguda Cylinder Blast: సిలిండర్ బ్లాస్ట్.. ముక్కలైన ఇంటి పైకప్పు.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ కుటుంబం

Kachiguda Cylinder Blast: సిలిండర్ బ్లాస్ట్.. ముక్కలైన ఇంటి పైకప్పు.. పెను ప్రమాదం నుంచి బయటపడ్డ కుటుంబం
Advertisement

Kachiguda Cylinder Blast: హైదరాబాద్‌లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానగర్‌లో ఆదివారం ఒక ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ ప్రమాదం సంభవించింది. సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఆ ధాటికి ఇంటి పైకప్పు ముక్కలు ముక్కలుగా విరిగిపడింది. భారీ శబ్దంతో జరిగిన ఈ పేలుడు వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ఉన్న వారు పని మీద బయటకు వెళ్లినట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పేలుడు తీవ్రతకు ఇంటి గోడలు పగుళ్లు ఇవ్వగా.. పైకప్పు రేకులు.. సిమెంట్ పెచ్చులు చెల్లాచెదురుగా పడిపోయాయి.

Advertisement

ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న కాచిగూడ పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా ఆగిపోయాయి. గ్యాస్ లీకేజీ వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×