E-Paper
Advertisement

గ్యాస్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు.. కాపాడిన 108 సిబ్బంది!

గ్యాస్ పేలి తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలు.. కాపాడిన 108 సిబ్బంది!
Advertisement

Cylinder Blast: స్వేచ్ఛ బ్యూరో: ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా అనుకోకుండా జరిగిన ప్రమాదం ఒక కుటుంబాన్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఈ ఘటనలో తండ్రితో పాటు ఆయన ముగ్గురు చిన్న పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

ఏం జరిగిందంటే?

Advertisement

ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్ (37) అనే వ్యక్తి తన ఇంట్లో గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో శ్రీనివాస్‌తో పాటు ఆయన పిల్లలు ప్రవళిక (14), హరిప్రియ (10), కుమారుడు విక్రాంత్ (6)లకు తీవ్ర గాయాలయ్యాయి.

సమయానికి ఆదుకున్న 108 సిబ్బంది

Advertisement

అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురై, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని గమనించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్ 108 సిబ్బంది ఈఎంటీ సీతారాం, పైలట్ బాలకృష్ణలు అత్యవసరంగా అక్కడకు చేరుకున్నారు.

వైద్యుల సూచనలతో ప్రథమ చికిత్స

సంఘటనా స్థలంలో బాధితుల పరిస్థితిని చూసి, ఈఆర్‌సీపీ డాక్టర్ చక్రవర్తి ఫోన్ ద్వారా ఇచ్చిన సూచనల మేరకు ఈఎంటీ సీతారాం వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులందరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అర్ధరాత్రి వేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు సకాలంలో స్పందించి, ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి చేర్చిన 108 సిబ్బంది సీతారాం, బాలకృష్ణల సమయస్ఫూర్తిని స్థానికులు, కుటుంబ సభ్యులు మనసారా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: 6 నెలలే టైమ్.. ఆ పని జరగకపోతే ప్రాణనష్టమే! ‘రంగం’లో స్వర్ణలత భవిష్యవాణి!

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×