E-Paper
Advertisement

Gas Cylinder Blast: లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

Gas Cylinder Blast: లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో పేలిన గ్యాస్ సిలిండర్.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు
Advertisement

Gas Cylinder Blast: హైదరాబాద్‌లోని చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో  భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 52 అంతస్తుల భారీ భవన ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. భవన నిర్మాణ పనుల కోసం కార్మికులు నివసించేలా ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం..  షెడ్లలో నిల్వ ఉంచిన గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దాంతో షెడ్లన్నీ క్షణాల్లో అగ్నికి ఆహుతయ్యాయి. మంటలు భారీగా ఎగసిపడటంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Advertisement

అయితే ప్రమాద సమయంలో కార్మికులందరూ భవన నిర్మాణ పనుల కోసం బయటకు వెళ్లి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించి మూడు ఫైర్ ఇంజన్లతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు గంటపాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపు చేశారు.

ఈ అగ్నిప్రమాదంలో షెడ్లకు భారీ ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా. ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసి  గ్యాస్ సిలిండర్ పేలుడు కారణాలపై దర్యాప్తు చేపట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×