E-Paper
Advertisement

కరీంనగర్ మీ జాగీరు కాదు.. బరాబర్ వస్తాం.. బండికి గంగుల స్ట్రాంగ్ కౌంటర్

కరీంనగర్ మీ జాగీరు కాదు.. బరాబర్ వస్తాం.. బండికి గంగుల స్ట్రాంగ్ కౌంటర్
Advertisement

Gangula Kamalakar: కరీంనగర్ కు వస్తే అడ్డుకుంటామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఘాటుగా బదులిచ్చారు. కరీంనగర్ బండి సంజయ్ జాగురు కాదని, బరాబర్ వస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో గంగుల మాట్లాడారు. కేటీఆర్ తన కరీంనగర్ పర్యటనలో.. రాష్ట్రంలోని దోపిడి, శాంతి భద్రతలపై మాట్లాడారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్న వ్యక్తిగా మాట్లాడారని కేంద్రమైన, రాష్ట్రమైన ప్రశ్నించాల్సిందేనని తెలిపారు.

కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా ఉంటూ బండి సంజయ్ వాడుతున్న భాష బాగోలేదని గంగుల కమలాకర్ అన్నారు. దీన్ని తాము ఖండిస్తున్నామన్నారు. ఆయన బీజేపీ కార్యకర్తలా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ పైన వాడిన భాషతో సిగ్గుపడుతున్నామన్నారు. ‘బండి.. నువ్వు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి అన్న సంగతి మర్చిపోకు’ అని సూచించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి అంశం, డంప్ యార్డ్ అంశం అన్ని పెండింగ్ లో ఉన్నాయని వాటి మీద ఫోకస్ చేయాలని సూచించారు. రెండున్నరెండ్లు గా కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదని.. దీనిపై తాము కచ్చితంగా ప్రశ్నిస్తామన్నారు.

Advertisement

Also Read: Pregnancy: ఏ వయసులో గర్భం ధరించాలి? పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఉందా?

మరోవైపు అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానందగౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ రైతు సభ సక్సెస్ కావటంతో ప్రభుత్వం లో వణుకు పుడుతోందన్నారు. రైతు డిక్లరేషన్ తో రైతులను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రైతులకు ఏం చేశారో శ్వేత పత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ తోక పార్టీగా మారిందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ అని రెండున్నరేళ్లనుంచి కాలయాపన చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ మోదీకి కార్యకర్త లాగా మారాడని విమర్శించారు. కాంగ్రెస్ కు ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి.. కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×