E-Paper
Advertisement

Jangaon News: బచ్చన్న పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం.. పట్టించుకోని యంత్రాంగం!

Jangaon News: బచ్చన్న పల్లెల్లో ఏరులై పారుతున్న మద్యం.. పట్టించుకోని యంత్రాంగం!
Advertisement

Jangaon News: స్వేచ్చ బ్యూరో: మండలంలోని వివిధ గ్రామాల్లో అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలని, కల్తీ మద్యం విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌ల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జనగామ జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంజిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

ఆర్థిక పరిస్థితి దారుణం..

నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపులు విచ్చలవిడిగా నడుస్తున్నాయి. దీంతో కల్తీ మద్యం సులభంగా దొరుకుతోంది. నాణ్యత లేని మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. అనేక మంది అనారోగ్యాల బారిన పడుతున్నారు. మద్యం వ్యసనంతో కుటుంబాల్లో కలహాలు, మహిళలు-చిన్నారులు ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితి క్షీణిస్తోంది. రోజువారీ కూలీలు, పేదలు సంపాదనలో పెద్ద భాగం మద్యానికే ఖర్చు చేస్తున్నారు.

Advertisement

Also read: Kalvakuntla Kavitha: డ్రామాలొద్దు.. కాంగ్రెస్ సర్కార్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!

అక్రమ మద్యం

దీని వల్ల జీవనోపాధి దెబ్బతింటోంది. కల్తీ మద్యం వల్ల ప్రాణాపాయ పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. అన్ని అక్రమ బెల్ట్ షాపులను గుర్తించి వెంటనే మూసివేయాలి. నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. గ్రామాల్లో నిరంతర తనిఖీలు చేసి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు దూడల కనకయ్య, ముసిని రాజు గౌడ్, మహమ్మద్ షబ్బీర్, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

Also read: Supreme Court: ఆ ఒక్క కారణంతో స్కూళ్లను అడ్డుకోవద్దు.. తమిళనాడుకు సుప్రీం వార్నింగ్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×