E-Paper
Advertisement

BRS Politics: పంచాయతీ ఫలితాలు.. బీఆర్ఎస్‌లో గేమ్ మొదలు, హరీష్‌రావు కోసం కొత్త పదవి?

BRS Politics: పంచాయతీ ఫలితాలు.. బీఆర్ఎస్‌లో గేమ్ మొదలు, హరీష్‌రావు కోసం కొత్త పదవి?
Advertisement

BRS Politics: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్‌లో దుమారం మొదలైందా? కేటీఆర్ కంటే హరీష్‌రావు తన మద్దతుదారులకు ఎక్కువ మందిని గెలిపించుకున్నారా? ఉత్తర తెలంగాణ నేతలు పార్టీ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారా? ఈ నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆ మాట అన్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

పంచాయతీ ఫలితాలు.. బీఆర్ఎస్‌లో గేమ్ మొదలైందా?

Advertisement

రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు ఉంటాయి. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుంటే ఉన్నత పదవులను అందుకోవచ్చు. లేకుంటే కష్టమని చాలామంది నేతలకు తెలుసు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తర్వాత గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందుకొచ్చారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న అంతర్గత రాజకీయాల గురించి కొన్ని విషయాలు బయటపెట్టారు.

ఆ విషయాలు బయటపెడతారని రాజకీయ నేతలు ఊహించలేదు. కొన్నాళ్లుగా బీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఆ చర్చ జరుగుతోంది.  సరిగ్గా అదే సమయంలో పంచాయతీ ఎన్నికలు వచ్చాయి.  పార్టీల కంటే కేటీఆర్ వర్సెస్ హరీష్‌రావు మధ్య ఫైట్‌గా భావించారు. అనుకున్నట్లుగా బామ్మర్దిపై బావ పైచేయి సాధించారు.

Advertisement

హరీష్‌రావు కోసం కొత్త పదవి?

పంచాయతీ ఎన్నికల్లో సిరిసిల్లాలో కాంగ్రెస్ హవా సాగింది.  సిద్ధిపేట్ జిల్లాలో కాంగ్రెస్‌కు గట్టిపోటీ ఇచ్చింది బీఆర్ఎస్. ఈ ఎన్నికలను ఓవరాల్‌గా పరిశీలించిన రాజకీయ విశ్లేషకులు.. హరీశ్‌రావు‌కు 54 శాతం, కేటీఆర్‌కు 35 శాతం వచ్చినట్టు చెబుతున్నారు.  ఈ గణాంకాలపై బీఆర్ఎస్ కేడర్ చర్చించుకుంటోంది.  కేటీఆర్ కంటే హరీష్‌కు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారని అంటున్నారు.

బీఆర్ఎస్‌లో హరీష్‌రావుని మాస్ లీడర్‌గా.. కేటీఆర్‌ను క్లాస్ లీడర్‌గా చాలామంది నేతలు వర్ణిస్తుంటారు. ఆ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడిగా కేటీఆర్ ఉన్నారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీ ఎక్కువగా ఓటములు ఎదురయ్యాయి. పంచాయతీ ఫలితాలు తర్వాత ఉత్తర తెలంగాణ నేతలు పార్టీ హైకమాండ్‌ని కలిసినట్టు తెలుస్తోంది.

ALSO READ:  ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం

హరీష్‌రావుకు పార్టీలో కీలకమైన పదవి ఇవ్వాలని ఆ నేతలు ఒత్తిడి చేసినట్టు ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ ఆ తరహా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. ఇక ఫిబ్రవరిలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండడంతో హరీష్‌రావు‌కు కీలక పదవి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

దీనివల్ల పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.  ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పార్టీ అధినేత కేసీఆర్ గమనిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో హరీష్ కోసం ప్రత్యేకంగా పదవి క్రియేట్ చేస్తారా? లేదా? అనేది చూడాలి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×