E-Paper
Advertisement

Gadwal SP: ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలి.. పోలింగ్ స్టేషన్లలో ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు!

Gadwal SP: ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలి.. పోలింగ్ స్టేషన్లలో ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మిక తనిఖీలు!
Advertisement

Gadwal SP:  పురపాలక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లా ఎస్పీ  సాయంత్రం గద్వాల్ పట్టణంలో ఉన్న పలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా, నిష్పక్షపాతంగా జరిగేలా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.

Also Read: HYDRA: రూ. 1511 కోట్ల భూములు సేఫ్.. ఒకే రోజు నాలుగు ప్రాంతాల్లో హైడ్రా బిగ్ ఆపరేషన్లు! 

సీసీ కెమెరాల ఏర్పాటు

Advertisement

ఈ సందర్భంగా గంజిపేట పరిధిలోని మౌంటేశ్వరి స్కూల్, వేదనగర్ లోని దయానంద విద్యా మందిర్, రాఘవేంద్ర కాలనీలోని ప్రభుత్వ పాఠశాల, ఎమ్.ఏ.ఎల్.డి. జూనియర్ కాలేజ్ తదితర పోలింగ్ కేంద్రాలను ఎస్పీ గారు సందర్శించి, అక్కడ చేపట్టిన భద్రతా చర్యలు, పోలీస్ బందోబస్తు, సీసీ కెమెరాల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు. అవసరమైన చోట మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు.

సరిగా ఉన్నాయా లేదా? 

వివిధ పోలింగ్ స్టేషన్ల దగ్గర డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని జిల్లా ఎస్పీ డీఎస్పీ గద్వాల్ వై. మొగిలయ్యతో చర్చించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సమయానికి భోజనం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని గద్వాల్ టౌన్ ఎస్సైని ఆదేశించారు.ఈ తనిఖీలలో జిల్లా ఎస్పీతో పాటు గద్వాల్ డీఎస్పీ వై. మొగిలయ్య, గద్వాల్ సర్కిల్ ఆఫీసర్ టంగుటూరి శ్రీను, పట్టణ ఎస్సై కళ్యాణ్ పాల్గొన్నారు.

Advertisement

Also ReadDGP Shivadhar Reddy: మున్సిపోరుకు భారీ బందోబస్తు.. 3వేల మంది అదనపు బలగాలు.. డీజీపీ కీలక సూచనలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×