// // Gadwal Municipality Results: మున్సిపల్ పీఠం కోసం మొదలైన -->
E-Paper
Advertisement

Gadwal Municipality Results: మున్సిపల్ పీఠం కోసం మొదలైన రాజకీయ చదరంగం.. ఆ ముగ్గురు కౌన్సిలర్లే గేమ్ చేంజర్లు!

Gadwal Municipality Results: మున్సిపల్ పీఠం కోసం మొదలైన రాజకీయ చదరంగం.. ఆ ముగ్గురు కౌన్సిలర్లే గేమ్ చేంజర్లు!
Advertisement

Gadwal Municipality Results:  గద్వాల మున్సిపాలిటీ ఫలితాలు వెలువడటంతో ఇప్పుడు అందరి దృష్టి “లక్కీ ఫిగర్” (మేజిక్ ఫిగర్) పై పడింది. ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో స్వల్ప తేడా ఉండటంతో గద్వాల రాజకీయం ఆసక్తికర మలుపు తిరిగింది. ఇక్కడ మెజార్టీకి 19 సీట్లు అవసరం కాగా ముగ్గురి కౌన్సిలర్ల మద్దతు అవసరం ఉంది.

స్వతంత్రులకు పెరిగిన గిరాకీ

మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన బలం కోసం ఇండిపెండెంట్‌గా గెలిచిన ఇద్దరు అభ్యర్థులతో పాటు ఎంఐఎం నుంచి గెలిచిన అభ్యర్థికి ఇప్పుడు ఫుల్ డిమాండ్ పెరిగింది. ప్రధాన పార్టీలు (కాంగ్రెస్, బీఆర్ఎస్) ఇప్పటికే వీరిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులు ఉండగా 16 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా 12 వార్డులలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 7 వార్డులలో బీజెపి అభ్యర్థులు విజయం సాధించగా ఇద్దరు ఇండిపెండెంట్ లు, ఒక వార్డులో ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. 8వ వార్డులో ఒక ఓటుతో బిఆర్ఎస్ అభ్యర్థి జయమ్మ విజయం సాధించినట్లు ప్రచారం జరగగా తిరిగి రీకౌంటింగ్ నిర్వహించడంతో కాంగ్రెస్ అభ్యర్థి తిరిగి విజయం సాధించారు.

కింగ్ మేకర్లు ఎవరు ?

Advertisement

స్వతంత్ర అభ్యర్థులు ఎటువైపు మొగ్గు చూపుతారనే దానిపైనే గద్వాల మున్సిపల్ చైర్మన్ ఎవరనేది ఆధారపడి ఉంది. ఇప్పటికే వారిని తమ వైపు తిప్పుకునేందుకు కౌంటింగ్ కేంద్రం దగ్గరే కాపు కాసి కరాటే సత్యం ను బండ చంద్రశేఖర్ రెడ్డి తిరుపతయ్య తమ వెంట తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు.

Also Read: Telangana Govt: మొబైల్ అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం కసరత్తు.. అర్హులైన వారందరికీ ఇంటికే సరుకులు!

నెలకొన్న ఉత్కంఠ

Advertisement

అభ్యర్థుల వేట, క్యాంప్ రాజకీయాలు మొదలైన నేపథ్యంలో చివరకు గద్వాల కోట ఎవరి వశమవుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఎక్స్ అఫీషియల్ మెంబర్లతో గద్వాల పూర్వ పీఠాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.

వడ్డేపల్లి మున్సిపల్ ఎన్నికల్లో సంచలన విజయం

జోగులాంబ గద్వాల జిల్లాలో ఎవరు ఊహించని రీతిలో విజయం సాధించారు. కాంగ్రెస్ , బీఆర్ఎస్ , బీజెపి లాంటి ప్రధాన పార్టీలను కాదని ఇటీవల ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బీఫాంలపై వడ్డేపల్లి మాజీ జడ్పిటిసి శ్రీనివాస్ వర్గం పోటీ చేసింది. జిల్లా రాజకీయాలలో ఈ ఫలితాలు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి. మున్సిపాలిటీలోని 10 వార్డులకు గాను 8 వార్డులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి గెలుపొంది కవిత మద్దతుదారులు ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కవిత మద్దతుదారులైన గంగుల రంజిత్ కుమార్ తో కలిసి కవిత సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఐదు వార్డులలో విజయం

ఎన్నికలపై కవిత ప్రభావం లేదని, ఆమె ప్రచారానికి లేదని, నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో నాకు ప్రజల్లో ఉన్న ఆధారాభిమానాలతోనే 8 సీట్లు సాధించామని వడ్డేపల్లి శ్రీను తెలిపారు. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కు చేరొక్క కౌన్సిలర్ స్థానం దక్కింది. ఐజ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండగా 13 వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోగా 7 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నిక కానున్నారు. అలంపూర్ మున్సిపాలిటీలోని 10 వార్డులకు గాను ఐదు వార్డులలో కాంగ్రెస్, బీఆర్ఎస్ సైతం ఐదు వార్డులలో విజయం సాధించింది.

Also Read: Thalapathy Vijay: ప్రభుత్వం ఇచ్చే డబ్బును తీసుకోండి కానీ ఓటు మాత్రం టీవీకేకే వేయండి.. దళపతి విజయ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×