E-Paper
Advertisement

MP Mallu Ravi: మున్సిపాలిటీ ఎన్నికలలో 80 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం : ఎంపీ మల్లు రవి

MP Mallu Ravi: మున్సిపాలిటీ ఎన్నికలలో 80 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం : ఎంపీ మల్లు రవి
Advertisement

MP Mallu Ravi:  గద్వాల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల కృషి చేస్తామని ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) అన్నారు.  గద్వాల మున్సిపాలిటీ లో కౌన్సిలర్లు, చైర్ పర్సన్ జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకుడు రాములు నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి తో కలిసి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలలో 80 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు.

Also ReadIbrahimpatnam Municipality: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై రాళ్లతో దాడులు.. నేటికి చైర్మన్​ ఎన్నిక వాయిదా?

ప్రజా పాలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు

Advertisement

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గద్వాల మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా మంత్రులు, ఎంపీ సహకారంతో గద్వాల మున్సిపాలిటీలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనులు చేసేలా కృషి చేస్తానన్నారు.

ఎమ్మెల్యే ఎంపీకి ధన్యవాదాలు

గద్వాల ప్రజలు నాపై నమ్మకం ఉంచి మున్సిపాలిటీలో మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పాలన ఉంటుందన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. గద్వాల పట్టణ సమగ్ర అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు పార్టీలకతీతంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

Also Read: Hyderabad News: లక్ష ఇస్తావా? ఖతం చేయమంటావా? వ్యాపారిని బెదిరించిన రౌడీ గ్యాంగ్​!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×