E-Paper
Advertisement

Gadwal Politics: మున్సిపాలిటీలో బీఫాం ల కేటాయింపుపై.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో సంపత్ భేటీ!

Gadwal Politics: మున్సిపాలిటీలో బీఫాం ల కేటాయింపుపై.. బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో  సంపత్ భేటీ!
Advertisement

Gadwal Politics:  గద్వాల మున్సిపాలిటీలో బీఫాం ల కేటాయింపుపై ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ భేటీ అయ్యారు. గద్వాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయిన గంజిపేట శంకర్ కు బిఫాం కేటాయింపుపై ఆయన చర్చలు జరిపారు. మాజీ జడ్పీ చైర్ పర్సన్ సరిత వర్గంలో కొనసాగుతున్న శంకర్ తాజాగా జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలలో పార్టీ బి ఫాం దక్కుతుందనే ధీమాతో ఉన్న ఆయనకు చుక్కెదురైంది.

Also Read: Huzurabad News: విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు బడ్జెట్‌లో.. ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలి: డీటీఎఫ్ డిమాండ్!

అభ్యర్థిత్యంపై అనిశ్చితి

Advertisement

కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వర్గానికే మున్సిపాలిటీ బీఫాంలు కేటాయించడంతో ఆయన అభ్యర్థిత్యంపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో సంపత్ కుమార్ గంజిపేట శంకర్ ను ఎమ్మెల్యే ఇంటికి తీసుకువచ్చి 14 వ వార్డు టికెట్టు కేటాయించేలా ఆయనను కోరారు. ఇప్పటికే ఎమ్మెల్యే వర్గంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న కురుమన్న కు వార్డు టికెట్ ఖరారు చేయగా ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నిర్ణయం ఎలా ఉంటుందనే అంశంపై సర్వత్రా స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.

మరోమారు భేటీ

మున్సిపాలిటీలలో అభ్యర్థుల గెలుపుపై ఎసిసి కార్యదర్శి సంపత్ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మూరోమారు గద్వాలలో చర్చలు జరిపారు. 14వ వార్డు నుంచి బీఫామ్ ఆశిస్తున్న శంకర్ కు ఎట్టకేలకు టికెట్ ఇచ్చేందుకు ఎమ్మెల్యే సుముఖత వ్యక్తం చేశారు. 11వ వార్డు నుంచి టికెట్ ఆశిస్తున్న ఇసాక్ కు ప్రత్యామ్నాయంగా మరో పదవి కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చాడు. నేడు వార్డులలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీఫాంలు పంపిణీ చేసే అవకాశం ఉంది.

Advertisement

Also Read:Huzurabad Municipal Election: ప్రజల అవసరాలే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోంది : కాంగ్రెస్ నేత వొడితల ప్రణవ్! 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×