E-Paper
Advertisement

‘ఫ్యూచర్ సిటీ’ని అడ్డుకుంటే వంద మీటర్ల లోతున బొంద పెడతాం.. హరీష్ రావుకు మెట్టు సాయికుమార్ స్ట్రాంగ్ వార్నింగ్!

‘ఫ్యూచర్ సిటీ’ని అడ్డుకుంటే వంద మీటర్ల లోతున బొంద పెడతాం.. హరీష్ రావుకు మెట్టు సాయికుమార్ స్ట్రాంగ్ వార్నింగ్!
Advertisement

Future City: తెలంగాణలో ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు చుట్టూ రాజకీయాలు వేడెక్కాయి. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న విమర్శలకు రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మాజీ మంత్రి హరీష్ రావుపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మతిలేని, సూటిలేని మాటలతో హరీష్ రావు ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాలిగోటికి కూడా సరిపోని వారు ఆయనపై మాట్లాడటం దుర్మార్గమని ధ్వజమెత్తారు.

ఫ్యూచర్ సిటీని ఆపే దమ్ము, సత్తా హరీష్ రావుకు కానీ, ఆయన మామ కేసీఆర్‌కు గానీ, బావమరిది కేటీఆర్‌కు గానీ లేవని సాయికుమార్ స్పష్టం చేశారు. ఒకవేళ ఎవరైనా ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తే వంద మీటర్ల గోతిలో బొందపెడతామని, అడ్డంగా నరికేస్తామని హెచ్చరించారు. అడ్డగోలుగా మాట్లాడుతున్న అడ్డగాడిదలకు తెలంగాణ యువత త్వరలోనే బుద్ధి చెబుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడం, ఆ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ నేతలు ఎన్ని పొర్లుదండాలు పెట్టినా మళ్లీ గెలిచే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Advertisement

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ యువత భవిష్యత్తును పూర్తిగా గాలికొదిలేశారని సాయికుమార్ విమర్శించారు. అప్పట్లో నాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌కు ‘సైబర్ సిటీ’ని తీసుకొచ్చి ఐటీ హబ్‌గా మారిస్తే.. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘ఫ్యూచర్ సిటీ’ని తీసుకొచ్చి రాష్ట్రాన్ని మరోస్థాయికి తీసుకెళ్తున్నారని కొనియాడారు. అలాంటి అద్భుతమైన ప్రాజెక్టును అడ్డుకుంటూ హరీష్ రావు తెలంగాణ యువత ఉపాధిని, వారి భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో యువత అంతా ఏకమై బీఆర్ఎస్ నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.

Also Read: మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న ‘SIR’ మంత్రం

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×