E-Paper
Advertisement

Musi Beautification: మూసీ సుందరీకరణకు మేమందరం ఫుల్ సపోర్ట్..?

Musi Beautification: మూసీ సుందరీకరణకు మేమందరం ఫుల్ సపోర్ట్..?
Advertisement

Musi Beautification: స్వేచ్ఛ బ్యూరో: మూసీ సుందరీకరణకు బీజేపీ సపోర్ట్ చేస్తుందని మహారాష్ట్ర సీఎం సలహాదారు వెదిరె శ్రీరామ్ తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనం-వాస్తవాలు అంశంపై టీబీజేపీ ఆధ్వర్యంలో సోమాజిగూడలో నిర్వహించిన చర్చా కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి సలహాదారు, కేంద్ర జలవనరుల శాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీరామ్ వక్తగా హాజరై మాట్లాడారు. మూసీ సుందరీకరణకు బీజేపీ సపోర్ట్ చేస్తుందని, కానీ మూసీ సుందరీకరణ చేసే విధానాన్ని మాత్రం బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ఎందుకంటే మూసీ ప్లానింగ్ సరిగ్గా లేదన్నారు. ప్లానింగ్ సరిగ్గా లేకుంటే బాధాకరంగా మిగిలిపోతుందన్నారు. భారత దేశం చాలా గొప్పదని, చాలా జీవనదులు ఉన్నాయని ఆయన వివరించారు.

రూ.160 కోట్ల డీపీఆర్‌తో..

మూసీలో చేపలు జీవించినపుడు, మనుషులు ఈత కొట్టినపుడు.. అప్పుడు మూసీ సుందరీకరణ చేయాలని సూచించారు. అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి పనిచేస్తేనే మూసీ ప్రక్షాళన సక్సెస్ అవుతుందన్నారు. అన్ని రాష్ట్రాల్లో నదుల ప్రక్షాళన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. రూ.160 కోట్ల డీపీఆర్ తో ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. తాము తయారుచేసిన మూసీ మొదటి డీపీఆర్ ఇవ్వమంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అనుమతితో ఫ్రీగా ఇచ్చేందుకు సిద్ధమని ఆయన స్పష్టంచేశారు. మూసీ మిడిల్ పాయింట్ నుంచి రెండు వైపులా 100 మీటర్లు బఫర్ జోన్ అంటున్నారని, మూసీకి రెండు వైపులా గోడ కట్టడం కరెక్ట్ కాదని శ్రీరామ్ తెలిపారు. ప్రొటెక్టెడ్ జోన్ లో ఎటువంటి నిర్మాణాలు ఉండకూడదని పేర్కొన్నారు. వార్నింగ్, రెగ్యులేటరీ జోన్ నిర్మాణాలు ఉండవచ్చని తెలిపారు.

Advertisement

Also Read: Janasena Controversy: త్రిసభ్య కమిటీ విచారణ తుస్సేనా.. జనసేన ఎమ్మెల్యేలపై సేనాని మౌనం ఎందుకో..!

వాటర్ క్వాలిటీ తోనే..

సీడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ని మూసీ డీపీఆర్ కి ఎలా ట్రాన్స్లేట్ చేశారన్నది డీపీఆర్ లో లేనే లేదని శ్రీరామ్ పేర్కొన్నారు. మూసీ వద్ద 55 కిలోమీటర్ల పార్క్ అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు.. ప్రొటెక్టెడ్ జోన్ లో లేరని, వార్నింగ్ జోన్‌లో వారిని ఖాళీ చేయించాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. మూసీ డీపీఆర్‌లో స్పష్టత లేదని వ్యాఖ్యానించారు. స్టేక్ హోల్డర్స్ పార్టీస్పేషన్ లేనిది ఇలాంటి ప్రాజెక్ట్స్ ముందుకు వెళ్లవని తెలిపారు. వాటర్ క్వాలిటీ తోనే ఏదైనా సాధ్యమవుతుందని చెప్పారు. డీపీఆర్ లో కీ పర్ఫార్మెన్స్ ఏంటనేది లేదన్నారు. సియోల్ లో 5 కిలోమీటర్ల కోసం అక్కడి సర్కార్ 4,200 మీటింగ్స్ పెట్టిందని, మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని మీటింగ్స్ పెట్టిందని వెదిరె శ్రీరామ్ ప్రశ్నించారు. సబర్మతి అభివృద్ధికి రూ.1100 కోట్లు ఖర్చయితే రూ.1500 కోట్లు రెవెన్యూ వస్తోందని ఆయన గుర్తుచేశారు.

Advertisement

Also Read: RRR Project: ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టుకు కేద్రం బ్రేక్.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇప్పుడెలా..?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×