E-Paper
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇంధన కష్టాలు.. బంకుల ఓనర్లు కొత్త నిబంధనలు, రంగంలోకి టాస్క్‌ఫోర్స్

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇంధన కష్టాలు.. బంకుల ఓనర్లు కొత్త నిబంధనలు, రంగంలోకి టాస్క్‌ఫోర్స్
Advertisement

Fuel Crunch: తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది? ఆయిల్ కొరత ఎందుకు ఏర్పడింది? యుద్ధం మళ్లీ తీవ్రమవుతుందని వినియోగదారులు భయపడుతున్నారా? పెట్రోల్ బంకులు హైప్ క్రియేట్ చేస్తున్నాయా?  కొంతమంది ఆయిల్‌ను నిల్వ చేసుకునే పనిలో పడ్డారా? అధికారులు ఏమంటున్నారు? గ్యాస్ సిలిండర్ల పరిస్థితి ఏంటి? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇంధన కష్టాలు

Advertisement

ఇరాన్‌లో యుద్ధం ఇంకా ముగిసిపోలేదు. ఇరాన్-అమెరికా మధ్య చర్చలు అంతర్గతంగా ఇంకా జరుగుతున్నాయి. కాల్పుల విరమణపై అమెరికా ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. హోర్మూజ్ జలసంధి వద్ద ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. అక్కడి నుంచి నేరుగా భారత్‌కు చమురు నౌకలు వచ్చిన సందర్భాలు పెద్దగా కనిపించలేదు.

దీనికితోడు ఇరాన్-అమెరికా మధ్య చర్చల గురించి రోజుకో వార్త వెలుగులోకి రావడంతో యుద్ధం ముగిసే అవకాశాలు లేవని బలంగా నమ్ముతున్నారు ప్రజలు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఇంధన కష్టాలు మొదలయ్యాయి. చాలా పెట్రోల్ బంకుల వద్ద ఆయిల్ కొరత వెంటాడుతోంది. ఫలితంగా ఆయా బంకులను తాత్కాలికంగా మూసి వేస్తున్నారు నిర్వాహకులు.

Advertisement

ఏపీ, తెలంగాణలో పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ

కాస్తో కూస్తూ ఉన్న పెట్రోల్ బంకుల వద్ద రద్దీ తీవ్రమైంది. ఆదివారం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. వీకెండ్ అని చాలా మంది వాహనాదారులు తేలిగ్గా తీసుకున్నారు. సోమవారం నిద్ర లేవగానే వాహనాలతో పెట్రోల్ బంకుల వద్ద దర్శనమిచ్చారు. అప్పటికీ పెట్రోల్ బంకులు ఇంకా ఓపెన్ చేయలేదు.

ఈ ఉదయం గచ్చిబౌలిలోని పలు పెట్రోల్ బంకుల తీవ్రమైన రద్దీ నెలకొంది. లీటర్ పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. కొన్ని బంకుల్లో టూ వీలర్లకు రూ.200-300, కార్లకు రూ.1000 మాత్రమే ఆయిల్ ఇస్తామంటూ నిబంధనలు పెడుతున్నాయి. కేవలం హైదరాబాద్ సిటీలోనే కాకుండా, ఏపీలోని కీలకమైన నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

ALSO READ: అలకనంద నదిలో ఘోరం.. హైదరాబాద్ స్టూడెంట్ మిస్సింగ్, విద్యార్థి ఆనంద్ మోహన్‌

పలు చోట్ల నో స్టాక్‌ బోర్డులు దర్శన మిస్తున్నాయి. విజయవాడ, హైదరాబాద్, ఖమ్మం, కర్నూలు జిల్లాల్లో ఇంధన సమస్య తీవ్రంగా ఉన్నట్లుత తెలుస్తోంది. పశ్చిమాసియా యుద్ధ మేఘాల ప్రభావంతో ఆయిల్ కంపెనీలు సరఫరా నిలిపివేసినట్టు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నాయి.

అయినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తెలంగాణలో చమురు నిల్వలు ఫుల్‌గా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఎలాంటి సమస్య లేదని అంటున్నారు. ఈ విషయంలో వినియోగదారులు ఎలాంటి అపోహలకు గురి కావొద్దని చెబుతున్నారు. ఏమైనా అనుమానాలు ఉంటే 1967 నెంబర్‌ను సంప్రదించవచ్చని పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదిలాఉండగా ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం అప్రమత్తమైంది. బ్లాక్ మార్కెట్ దందాపై కఠిన చర్యలకు సిద్దమైంది సర్కార్. నిబంధనలు అతిక్రమిస్తున్న బంకులపై ప్రత్యేక నిఘా పెట్టింది. రంగంలోకి స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలు దిగాయి. స్టాక్ రిజిస్టర్లు, అమ్మకాల రికార్డుల క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నాయి. అక్రమాలు చేస్తే లైసెన్సులు రద్దు సహా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించాయి.

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×