E-Paper
Advertisement

Frog in Beer: బీరులో బెక బెక.. బాటిల్‌లో కప్పను చూసి కంగారు పడ్డ మందుబాబులు, ఎక్కడో కాదు.. ఇక్కడే!

Frog in Beer: బీరులో బెక బెక.. బాటిల్‌లో కప్పను చూసి కంగారు పడ్డ మందుబాబులు, ఎక్కడో కాదు.. ఇక్కడే!
Advertisement

మా వాడు బీర్ ఎత్తితే దించ‌కుండా తాగుతాడు తెలుసా..? అని చాలా మంది గొప్ప‌లు చెప్పుకుంటారు. కానీ ఎత్తితే దించ‌కుండా తాగ‌డం కాదు ముందు అందులో ఏముందో చూసుకుని తాగాలి. అదేంటి బీర్ లో ఏముంటుంది చూసుకుని తాగ‌డానికి అనుకుంటున్నారా? ఉంటాయ్.. బీరులో వాన‌పాములు, గ‌డ్డి, క‌ప్పలు ఇలా చాలా ఉంటాయి. ఇటీవ‌ల వ‌స్తున్న వార్త‌లే అందుకు నిద‌ర్శ‌నం. ఇటీవ‌లే బీరు బాటిళ్లో వాన‌పాము క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా కొద్ది రోజుల క్రితం బీరు బాటిల్ లో గుట్కా ప్యాకెట్ వ‌చ్చింది. ఇక తాజాగా బీరు బాటిల్ లోనే క‌ప్ప క‌లేబ‌రాలు వ‌చ్చాయి. వివ‌రాల్లోకి వెళితే… ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.

Also read: బెంగుళూరుకు హైడ్రా.. ఆ చెరువుల పున‌రుద్ద‌ర‌ణ‌పై రంగ‌నాథ్ మ‌రో మాస్ట‌ర్ ప్లాన్!

Advertisement

జిల్లాలోని డొంకేశ్వ‌ర్ మండ‌ల కేంద్రంలోని వైన్ షాపులో ఓ మ‌ద్యం ప్రియుడు హాయిగా కూర్చుని ఓ బీర్ తాగేందుకు సిద్దం అయ్యాడు. తీసుకున్న త‌ర‌వాత కాస్త స్ట‌ఫ్ తీసుకుని కూర్చుని బీర్ ఓపెన్ చేశాడు. అంతే అందులో క‌ప్ప క‌ళేబ‌రాలు క‌నిపించ‌డంతో ఒక్క‌సారిగా ఖంగు తిన్నాడు. దీనిపై వైన్ షాపు య‌జ‌మానిని నిల‌దీయడంతో అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీంతో నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు.

Also Read:

Advertisement

ఇక మ‌ద్యం ప్రియులకు అయితే దెబ్బ‌కు తాగింది కూడా దిగిపోతుంది. అయితే కేవ‌లం బీరు బాటిల్ లోనే కాదు. ఇలాంటివి తినే ఆహారంలోనూ రావ‌డం కామన్ అయిపోయింది. కాబ‌ట్టి బ‌య‌ట తిన‌కూడ‌ద‌ని ప‌దే ప‌దే ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ జ‌నాలు మాత్రం మార‌డంలేదు. ఏ రెస్టారెంట్ చూసినా భోజ‌న ప్రియుల‌తో నిండిపోతోంది. ఏ బార్ చూసినా మందుబాబుల‌తో క‌ల‌క‌ల‌లాడుతోంది. ఇదిలా ఉంటే తినేవారిని, తాగేవారిని ఎవ‌రూ ఆప‌లేరు కానీ కాస్త చూసుకుని తినడం, తాగ‌డం చేస్తే మీ ఆరోగ్యాల‌కే మంచిదని ఆరోగ్య‌నిపుణులు సూచిస్తున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×