E-Paper
Advertisement

TS Assembly 2024: చివరిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. టొబాకో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం

TS Assembly 2024: చివరిరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. టొబాకో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
Advertisement

TS Assembly Budget Session 2024: చివరిరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ పై చర్చ మొదలవ్వగా.. స్పీకర్ టీ బ్రేక్ ఇస్తారు. అనంతరం రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చ జరగనుంది. టొబాకో అండ్ సవరణ బిల్లును ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా హుక్కాను నిషేదిస్తూ.. ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ సభ్యులు ఆమోదం తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్ బాబు బిల్లును ప్రవేశపెట్టగా.. ఎలాంటి చర్చ లేకుండానే శాసనసభ బిల్లును ఆమోదించింది. రాష్ట్రంలో హుక్కా పార్లరను నిషేధించడం చాలా అవసరమని సీఎం భావించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. సిగరెట్ కంటే హుక్కా పొగ మరింత హానికరమన్న ఆయన.. అందులో బొగ్గును ఉపయోగించడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ విడుదల అవుతుందని తెలిపారు. హుక్కా సేవించే వారికే కాదు.. వారి చుట్టుపక్కల ఉన్నవారికి కూడా ప్రమాదమని ఆయన వివరించారు.

Advertisement

2023-24 సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్ పెండేచర్ పై ప్రకటన, కృష్ణాజలాలు, కాళేశ్వరంపై ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనుంది. ఈ మేరకు అసెంబ్లీలో రెండు ఎల్ ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సభలో తమకు కూడా ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ స్పీకర్ కు విజ్ఞప్తి చేయగా.. ఆయన తిరస్కరించారు. నేటి అసెంబ్లీలో కృష్ణాజలాలపై.. అధికార-ప్రతిపక్షాల మధ్య వాడీవేడి చర్చ జరగనుంది.

Read More: గ్రూప్‌-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. పరీక్షలకు లైన్‌ క్లియర్‌

Advertisement

మరోవైపు మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ సభను పార్టీలకు అతీతంగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ ఇక రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలన్నారు. కేఈర్ఎంబీపై సంతకం చేసి కేంద్రానికి అప్పజెప్పింది కేసీఆరేనన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమాగం చేసినదానిని తాము గాడిలో పెడుతున్నామన్నారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×