E-Paper
Advertisement

ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

ఫార్ములా-ఈ స్కామ్‌లో KTR A-1.. ఏసీబీ 77 పేజీల ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!
Advertisement

Formula E Case: 2023 ఫిబ్రవరిలో జరిగిన ఫార్ములా-ఈ రేసుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన యాంటీ కరప్షన్ బ్యూరో.. ఇప్పుడు కోర్టులో 77 పేజీల ఛార్జ్‌షీట్‌ వేసింది. కేసులో A-1గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును చేర్చిన ఏసీబీ అధికారులు.. మాజీ ఐఏఎస్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్ రెడ్డిల పాత్రను బయటపెట్టారు. కేబినెట్ అప్రూవల్ లేకుండా, ఫైనాన్స్, లా డిపార్ట్‌మెంట్స్‌కు ముఖం చాటేసి.. కేటీఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల హెచ్‌ఎండీఏ ఖజానా ఖాళీ అయిందని తేల్చింది ఏసీబీ. ఎఫ్‌ఈఓ కంపెనీకి 54.88 కోట్లు అడ్డగోలుగా మళ్లించడంతో పాటు, ఓవరాల్‌గా ప్రభుత్వానికి 600 కోట్ల భారం పడిందని.. హెచ్‌ఎండీఏకు 75.88 కోట్ల నష్టం జరిగిందని తేల్చింది ఏసీబీ.

ఛార్జ్‌షీట్‌లో ట్విస్ట్..

Advertisement

కేటీఆర్ ఆదేశాలతో ఐఏఎస్ అరవింద్ కుమార్ తన పవర్‌ను మిస్‌యూజ్ చేస్తూ సంతకాలు చేసుకుంటూ పోయారని ఛార్జ్‌షీట్‌లో ఉంది. సీజన్-1లో భారీగా మునిగిపోయిన ‘ఏస్ నెక్స్ట్-జెన్’ సంస్థను కాపాడేందుకు.. 160 కోట్లు రిలీజ్ చేస్తూ హడావుడిగా నోట్ ఫైల్ రెడీ చేశారు.

Also Read: కావేరి రగడ.. ‘జననాయగన్’ పై పడ్డ పొలిటికల్ అండ్ వాటర్ సెగ!

Advertisement

రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆశ చూపి సంతకాలు..

ఇదంతా కేవలం పర్సనల్ బెనిఫిట్స్ కోసం జరిగిన బిగ్ స్కామ్ అని ఏసీబీ తన ఛార్జ్‌షీట్‌లో కుండబద్దలు కొట్టింది. ఏస్ నెక్స్ట్-జెన్‌కు లబ్ధి చేకూర్చినందుకు.. ప్రతిఫలంగా ఆ సంస్థ అనుబంధ సంస్థ గ్రీన్ కో నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఏకంగా 44 కోట్లు ముట్టాయని.. ఇది పక్కా క్విడ్ ప్రో కో అంటూ ఆధారాలు సేకరించింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆశ చూపి బీఎల్‌ఎన్ రెడ్డితో సంతకాలు పెట్టించారని స్పష్టం చేసింది. ఇక కోర్టు విచారణలో భాగంగా.. కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలు పర్సనల్‌గా హాజరుకాగా.. లక్ష చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించిన జడ్జి.. నెక్స్ట్ హియరింగ్‌ను ఆగస్టు 25కి వాయిదా వేశారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×