E-Paper
Advertisement

బీఆర్ఎస్​ నేత ఇంట్లో భారీ చోరీ.. కోటిన్నరతో ఉడాయించిన దొంగలు!

బీఆర్ఎస్​ నేత ఇంట్లో భారీ చోరీ.. కోటిన్నరతో ఉడాయించిన దొంగలు!
Advertisement

House Burglary: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్​ఎస్ పార్టీ కీలక నేత ఇంట్లో దొంగలు పడ్డారు. కోటిన్నర రూపాయల నగదును తస్కరించి ఉడాయించారు. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ దొంగతనం సనత్​ నగర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

బీఆర్​ఎస్ పార్టీ సీనియర్​ నేత, మాజీ ఎంపీ సురేశ్​ రెడ్డి సనత్ నగర్​ ప్రాంతంలోని జెడ్​ కాలనీలో నివాసముంటున్నారు. శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవటాన్ని అవకాశంగా చూసుకున్న దొంగలు లోపలికి చొరబడ్డారు. ఐరన్​ సేఫ్​ లో భద్రపరిచిన కోటిన్నర రూపాయల నగదు, ఇతర విలువైన సొత్తును తస్కరించి ఉడాయించారు.

Advertisement

ఆదివారం ఉదయం వచ్చిన సురేశ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్​ టీం సహాయంతో ఆధారాలను సేకరించారు. సీసీ కెమెరాల ఫుటేజీని సేకరించి విశ్లేషిస్తున్నారు. తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.

Also Read: జలమండలి ఫలితమే దిక్సూచి.. జీహెచ్‌ఎంసీలోనూ కాంగ్రెస్‌దే గెలుపు: మహేష్ కుమార్ గౌడ్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×