E-Paper
Advertisement

Ramachandra Reddy: కేసీఆర్ స‌మ‌కాలికుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి!

Ramachandra Reddy: కేసీఆర్ స‌మ‌కాలికుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే మృతి!
Advertisement

Ramachandra Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామ‌చంద్రారెడ్డి మృతి చెందారు. గ‌త కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న హైద‌రాబాద్ లోని ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ క‌న్నుమూశారు. రామ‌చంద్రారెడ్డి సిద్దిపేట జిల్లా కొండ‌పాక గ్రామానికి చెందిన‌వారు. ఆయ‌న‌కు ఇద్ద‌రు కుమార్తెలు ఉండ‌గా ప్ర‌స్తుతం వారి వ‌ద్ద‌నే హైద‌రాబాద్ లో ఉంటున్నారు. దుబ్బాక ఒక‌ప్పుడు దొమ్మాట నుండి 1983లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అదే స‌మ‌యంలో మాజీ సీఎం కేసీఆర్ సిద్దిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో కేసీఆర్ కు రామ‌చంద్రారెడ్డి రాజ‌కీయ సమ‌కాలికుడిగా చెబుతుంటారు.

మాజీ ఎమ్మెల్యే మృతిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావు సంతాపం ప్ర‌క‌టించారు. 19883-88లో అప్ప‌టి దొమ్మాట నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ప‌నిచేశార‌ని గుర్తు చేశారు. ఆయ‌న సేవ‌లు నేటిత‌రం రాజ‌కీయ నాయ‌కుల‌కు ఎంతో స్పూర్తి అని కొనియాడారు, ఎమ్మెల్యే అయినా తుదిశ్వాస వ‌ర‌కు సాధార‌ణ జీవితాన్ని గ‌డిపార‌ని పేర్కొన్నారు. ఆయ‌న ప్ర‌జాసేవ‌కు ప‌రిత‌పించార‌ని, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల్లో ఆయ‌న చేసిన సేవ‌లు చిర‌స్థాయిగా నిలుస్తాయ‌ని చెప్పారు. వారి కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×