E-Paper
Advertisement

గుండ్లపోచంపల్లిలో విష విలయం.. వేల సంఖ్యలో చేపలు మృతి.. పట్టించుకోని అధికారులు

గుండ్లపోచంపల్లిలో విష విలయం.. వేల సంఖ్యలో చేపలు మృతి.. పట్టించుకోని అధికారులు
Advertisement

Lake Pollution: స్వేచ్ఛ బ్యూరో: గుండ్లపోచంపల్లి డివిజన్ పరిది గుండ్ల, నీళ్ల చెరువు పరిసర ప్రాంతాల్లో నిర్మించిన విల్లాస్‌ నుంచి డ్రైనేజీ నీటిని సెవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేకుండానే మురుగు నీటిని చెరువులో కలపడం వల్ల నీటి నాణ్యత క్షీణించి, చేపలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోకి చేరుతున్న కలుషిత నీటిలో రసాయనాలు, బ్యాక్టీరియా, విషపూరిత పదార్థాలు అధికంగా ఉండటంతో నీటిలో ఆక్సిజన్ స్థాయులు తగ్గిపోయితున్నాయని దింతో చెరువుపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఆర్థిక నష్టాన్ని ఎదుర్కుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: దాతల సహకారంతో.. మానవీయతకు మారుపేరుగా నిలిచిన ఓ వివాహం..!

స్పందించని అధికార యంత్రాంగం..

Advertisement

చేపల మరణంతో చేపల ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు వేటకు వెళ్లే మత్స్యకారులకు ఆదాయం లేకుండా పోతోందని లక్షల్లో నష్టం వాటిల్లుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్పందించడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, విల్లాస్‌ నుంచి వచ్చే డ్రైనేజీ నీరు నేరుగా చెరువులో కలుస్తుండటంతో నీరు నల్లగా మారి దుర్వాసన వల్ల చెరువుల్లో చేపల మృతికి కారణమయ్యాయని తెలిపారు. ఈ సమస్యపై కాలుష్య నియంత్రణ శాఖ, స్థానిక మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి చెరువులోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: నో స్టాక్ మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. ఉమ్మడి జిల్లాలో ఇంధన సంక్షోభం!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×