E-Paper
Advertisement

Sarpanch Elections: తెలంగాణలో గురువారం నుంచే.. తొలి విడత సర్పంచ్ ఎన్నికలు

Sarpanch Elections: తెలంగాణలో గురువారం నుంచే..  తొలి విడత సర్పంచ్ ఎన్నికలు
Advertisement

Sarpanch Elections: రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికల సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మూడు విడతలలో నామినేషన్ల ప్రక్రియ ఇప్పటికే పూర్తవ్వగా, తొలి విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచార ప్రక్రియ నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలో, తొలి విడత పోలింగ్‌ రేపు (గురువారం) జరగనుంది. పోలింగ్‌ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. ఎన్నికల నిర్వహణ కోసం నియమితులైన పీవోలు, ఏపీవోలకు ఇప్పటికే పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వడం జరిగింది.

భద్రత, సామాగ్రి తరలింపుపై ప్రత్యేక దృష్టి
ఎన్నికల నిర్వహణ కోసం ప్రతి మండలాన్ని జోన్లు, రూట్లుగా విభజించారు. పోలింగ్‌కు అవసరమైన సామగ్రిని అంతా మండల కేంద్రంలోని ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి బందోబస్తు కోసం పోలీసులను పోలింగ్‌ కేంద్రాల వారీగా కేటాయించారు. మండల కేంద్రాల్లో పోలింగ్‌ సామగ్రిని పంపిణీ చేసేందుకు ‘డిస్ట్రిబ్యూషన్ సెంటర్’, పోలింగ్ ముగిసిన తర్వాత తిరిగి సామగ్రిని, బ్యాలెట్ బాక్సులను స్వీకరించేందుకు ‘రికవరీ సెంటర్’ను ఏర్పాటు చేశారు. ఈ రోజు (బుధవారం) ఉదయం నుంచే పోలింగ్‌ సామగ్రిని, ఎన్నికల సిబ్బందిని గ్రామ పంచాయతీలకు తరలించే ప్రక్రియ మొదలవనుంది.

Advertisement

ప్రచారం ముగిసినా కొనసాగుతున్న ప్రలోభాలు
ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ, పార్టీ మద్దతుదారులు , అభ్యర్థుల ప్రలోభాలు మాత్రం తెర వెనుక కొనసాగుతూనే ఉన్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధానంగా రాత్రి పూట వ్యూహాలు అమలు చేస్తున్నారు. మహిళా సంఘాలు, కాలనీ సంఘాల సభ్యులతో రహస్యంగా భేటీ అవుతూ తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గెలిచిన పక్షంలో గ్రామానికి చేయబోయే పనులపై హామీలు గుప్పిస్తున్నారు. అత్యంత ముఖ్యంగా, కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం అయితే చాలు ఓటర్లను మద్యంలో ముంచెత్తుతున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఓటర్లను తమ అనుచరుల ఇళ్లకు రప్పించి, విందులు ఏర్పాటు చేసి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు.

అధికారుల నిఘా
ప్రచారం ముగిసినప్పటికీ, ఈ రకమైన ప్రలోభాలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కిందకు వస్తాయి. ముఖ్యంగా నగదు పంపిణీ, మద్యం సరఫరా వంటి చర్యలపై అభ్యర్థులపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, ప్రలోభాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలపై ఎన్నికల అధికారులు, పోలీస్ బృందాలు ప్రత్యేక నిఘా పెట్టాయి. ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ, ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Advertisement

Also Read: తీవ్ర విషాదం.. పెళ్లి చూపుల మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్
ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ దృష్ట్యా, జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలను అధికారులు బంద్ చేయిస్తున్నారు. నిన్న (మంగళవారం) సాయంత్రం నుంచి పోలింగ్ ముగిసే రేపటి (గురువారం) సాయంత్రం వరకు మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఇతర మద్యం విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజుల పాటు సాధారణ మద్యం షాపులతో పాటు, మద్యం అమ్మకాలు, సర్వ్ చేసేందుకు లైసెన్సులు పొందిన ఇతర వ్యాపార సంస్థలు కూడా ఎటువంటి విక్రయాలు జరపకూడదని స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×