E-Paper
Advertisement

Sangareddy News: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిన పత్తి మిల్లు, ఎగిసిపడిన మంటలు

Sangareddy News: సంగారెడ్డిలో భారీ అగ్ని ప్రమాదం.. తగలబడిన పత్తి మిల్లు, ఎగిసిపడిన మంటలు
Advertisement

Sangareddy News: సమ్మర్ రాకముందే అగ్రిప్రమాదాలు జోరందుకున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఓ పత్తి మిల్లులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మిల్లులోని సామాగ్రి ఖాళి బూడిదైంది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. నాలుగైదు గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.

ఆదివారం తెల్లవారుజామున సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కంగ్టి మండలం తుర్కా వడగామలోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో ఈ ఘటన జరిగింది. ఏం జరిగిందో తెలీదుగానీ, వేకువజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అందులోని సిబ్బంది అలర్టయి, ఫైర్ ఇంజన్-పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

ఈలోగా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అందులోని సామాగ్రి దాదాపు కాలి బూడిదైనట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మూడు వేల టన్నులకు పైగా పత్తి కాలపోయింది. దాదాపు రెండు కోట్ల నష్టం జరిగిందన్నది ఆ సంస్థ యజమాని మాట. అయితే ఈ ఘటనలో కార్మికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×