E-Paper
Advertisement

Fire Accident : పోలీస్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం.. 47 వాహనాలు ఆహుతి..

Fire Accident : పోలీస్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం.. 47 వాహనాలు ఆహుతి..
Advertisement

Fire Accident : సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 47 వాహనాలు దగ్దమయ్యాయి. రామచంద్రాపురం, చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడ్డ వాహనాలను పోలీస్ క్వార్టర్స్ ప్రాంగణంలో ఉంచారు. అగ్నిప్రమాదంలో 36 బైకులు, 8 కార్లు, 3 ఆటోలు అగ్నికి ఆహుతైనట్లు రామచంద్రాపురం సీఐ కట్టా నరేందర్ రెడ్డి వెల్లడించారు.

పోలీస్ క్వార్టర్స్ ప్రహారీ గోడకు అవతల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా బీడీని వెలిగించి పడేసారా అనే అనుమానాలు సీఐ వ్యక్తం చేశారు. చుట్టూ ఎండిగడ్డి ఉండటంతో ఒక్కసారి మంటలు చెలరేగాయన్నారు. దీంతో వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయని తెలిపారు. పోలీసులు ఫైరింజన్ సిబ్బందితో కలిసి మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టామన్నారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×